కనకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు
🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟 

శ్లో!! దిగ్ దిగంతిభిః కనకుంభముఖావసృష్ట
స్వర్ వాహినీ విమలచారు జలప్లుతాంగీమ్!
ప్రాతర్ నమామి జగతాం జననీ మశేష  
లోకాధి నాథ గృహిణి మ మృతాభ్ది పుత్రీమ్ !!

భావం: అబ్రము, కపిలా, పింగళాదులైన దిగ్గజముల భార్యలు(ఆడ ఏనుగులు) బంగారు 
కలశముల యందు పవిత్రమైన ఆకాశం గంగ నుండి పట్టితేగా, ఆ పరిశుద్ధమగు జలములతో అనునిత్యము స్నానము చేయు జగజ్జనని యు, 
లోకేశ్వరుడైన శ్రీ మహా విష్ణువు ని ఇల్లాలును, పాలకడలి యొక్క కూతురు ను అగు శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మీ భగవతి ని ప్రొద్దుననే లేచి భక్తితో స్మరించెదను. 
                     ****


కామెంట్‌లు