పువ్వులా కోమలంగా
నవ్వులన్నీ నిర్మలంగా
మువ్వలా రవళిస్తూ
రవ్వలా మెరుపులీను
మనసెంతో మధురం.
కొండలన్నీ చుట్టేస్తూ
కోనల్లో విహరిస్తూ
ఏటిలోని అలలపై తేలి
పరిమళాలు మోసుకొచ్చే
తెమ్మెరెంత మధురం
శిఖరాన ఘనీభవించి
లోయలందు కరిగి సాగుతూ
బండరాళ్ళ మీద వాలి
సరిగమలు పలికిస్తూ ఉరికే
జలపాతపు సవ్వడెంత మధురం
పట్టుపరికిణీలు కట్టుకుని
పచ్చని పెళ్ళి పందిరిలో
ముచ్చటగా ఆడుకునే
పసిపిల్లలల్లే పరుగులుతీయు
పాలమబ్బుల అందమెంత మధురం
తెలివెలుగుల కాంతులలో
తొలికిరణం పలకరించగా
నులివెచ్చని సిగ్గు ముంచుకొచ్చి
తలవంచి సిగ్గుపడే పెళ్ళిపడుచులా
ఊగే తరువుల కదలికలెంత మధురం
తెల్లవారి వెలుగులకు
మెల్లగ అడ్డు తొలగి
కోనలన్నీ మురిపించి
మనసును మై మరపించే
వెలుగుల వేకువ తెచ్చే
కొత్త వరాల మిఠాయి పొట్లానికి
🌸🌸 సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి