అటుకులు చిటుకులు మారండీ!;- ఎం. వి. ఉమాదేవి
అటుకులు చిటుకులు మారండీ 
అన్నాదమ్ములు మారండీ 
వీరా ముష్టి వీరా ముష్టి 
వీరెవరు?
మల్లిబాబు!
మల్లిబాబూ మల్లిబాబూ మారిపో!!

దాగుడుమూతల ఆటండీ 
దండాకోరులు ఆటండి!
అందరు చప్పట్లు వేసేరండీ 
దొంగకు కళ్ళు మూసేరండీ!

పెద్దలొక్కరిని పిలిచేరండి 
అమ్మని పేరు పెట్టేరండీ 
అందరు దాగిన తదుపరినా 
అమ్మ దొంగకు గంతలు విప్పేరండి!

వర్షాకాలం ఇంట్లో ఆటలు 
బారాకట్టా పులిజూదాలు 
గుజ్జనగూళ్లను ఆడేరండీ 
బొమ్మల పెళ్లిని చేసేరండీ!!

కామెంట్‌లు