'కృష్ణా!'శతకము.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
ఈ శతకము వివిధ రకముల వృత్తములలో వ్రాయబడినది 
=========================================
క్రొత్త వృత్తములు.
============
16.

పాంచాలాంఘ్రి -న, య, గ, గ.

గిరిధర గోపాలా!నీ
చరణములే దిక్కంచున్
సురలట చేరంగా నిన్
సురతుడ వంచున్ కృష్ణా!.//

17.

కరరికా -న,ర, గ, గ.

విరసమెందుకోయీ!నా
కరము వీడకోయీ!సుం
దరముఖారవిందా!నీ
కరుణ జూపూమా!కృష్ణా!.//

18.
రుద్రాళీగణలయనీ - న, స, గ,గ.

ఘనుడ వని నిన్ దల్తున్
క్షణికమగు భాగ్యంబుల్
కనను హరి!నీ రూపున్
గన నిలిచితిన్ కృష్ణా!.//

19.
కృష్ణగతికా -భ,జ,గ,గ.

పాదములు పట్టి కొల్తున్
వేదనలు తీర్చ వయ్యా!
నీదయను జూప రాదా!
నాదరికి రావ!కృష్ణా!.//

20.

చిత్రపదా-భ, భ, గ, గ.

కోరను గోర్కెలు శౌరీ!
భారము నీదని దల్తున్
సారెకు మ్రొక్కుచు నిన్నే
చేరితి నీదరి కృష్ణా!.//


కామెంట్‌లు