పాఠశాల విద్యారంగంలో నెలకొన్న సమస్యలు సత్వరమే పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కొత్తూరు మండల శాఖ వినతిపత్రం అందజేసింది.
ఆంధ్రప్రదేశ్ యుటిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి బోడ శ్రీను నేతృత్వంలో కొత్తూరు మండల రీసెర్చ్ కేంద్రంవద్ద మండలం విద్యా శాఖాధికారులు
సి.హెచ్.గోవిందరావు, ఎన్.శ్రీనివాస రావులకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా బోడ శ్రీను మాట్లాడుతూ
ప్రభుత్వం అమలు జరిపిన విద్యారంగం సంస్కరణల ఫలితంగా రాష్ట్ర విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసం సడలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసారు. మండల శాఖ అధ్యక్షులు ఎం.శోభన్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం కాకముందే, పరిస్థితులు విషమించిపోకముందే ప్రభుత్వం మేల్కొని పరిస్థితులు చక్కదిద్దాలని అన్నారు.
ప్రధాన కార్యదర్శి కె.విజయకుమార్ మాట్లాడుతూ, వివిధ యాజమాన్యాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయని గుర్తుచేసారు. పెరిగిన పనిభారంతో పాటు, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉపాధ్యాయలోకాన తీవ్ర అసంతృప్తి నెలకొనియుందని అన్నారు.
ప్రభుత్వానికి ఇచ్చిన వినతి పత్రంలో
జీవో 117 రద్దు చేయాలని,
ప్రీ ప్రైమరీ తో పాటు ఒకటి నుండి ఐదు తరగతులు ఒకే పాఠశాలలో కొనసాగాలని,
హై స్కూలులో రెండు మీడియంలో సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేసారు.
రాష్ట్రవ్యాప్తంగా ఒకే సిలబస్ ఒకే పరీక్ష విధానం అమలు చేయాలి,
ఉపాధ్యాయులను బోధనేతర పనులనుండి మినహాయించీ
పని భారం తగ్గించాలని మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వివరించడం జరిగింది.
నేటి కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బోడ శ్రీను, కొత్తూరు మండల యూటీఎఫ్ అధ్యక్షులు ఎ.శోభన్ బాబు, ప్రధాన కార్యదర్శి కె.విజయకుమార్, సహాధ్యక్షులు మోహన్ దాస్, ఆర్ధిక కార్యదర్శి వీరభద్రరావు, సీపీఎస్ కన్వీనర్ మధు, సంగమేసు, ఆర్.ఆర్.ఎం.కొండలరావు, మల్లేశ్వరరావు, బాలకృష్ణ, దినేష్, కృష్ణ, భుజంగరావు, ఉమామహేష్, గణేష్, చంద్రరావు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి