వేద కాలంలో వేదములన్నీ సంస్కృత భాషలోనే రచించబడ్డాయి ఆ రోజులలో ప్రజాభాష సంస్కృతం కనుక కాల ప్రవాహంలో ప్రాకృతం ఆ తర్వాత పాళీ తరువాత తెలుగు చివరకు ఆంధ్ర భాషగా 56 అక్షరాలతో పరిణతి చెందిన పరిపూర్ణ భాష ప్రజాభాషగా మిగిలింది ఆ రోజులలో కూడా కావ్యాలు వ్రాయడంలో కానీ నాటకాలు వ్రాయడంలో కానీ ఇటు కాళిదాసు అటు షేక్స్పియర్ అటు సంస్కృతం రాజులు లాంటి వారితో మాట్లాడించారు సామాన్య ప్రజలతో ఆంధ్ర భాషలోనూ సేవకులు భటులు ఇలాంటి వారితో ప్రాంతీయ భాషలను మాట్లాడించిన పద్ధతి మనకు తెలుసు అలాగే షేక్స్పియర్ ఓల్డ్ ఇంగ్లీష్ కరెంట్ ఇంగ్లీష్ మిక్స్డ్ ఇంగ్లీష్ మూడు పాత్రలను అలా పోషించారు అంటే ప్రపంచంలో ఉన్న మేధావి వర్గం వారు ఎక్కడ ఉన్నా వారి సృజన ఒక రకంగానే ఉంటుంది అనేది స్పష్టం.సనాతన భాషలో లేని ఏ పదము ప్రస్తుతం మనం వాడడం లేదు మనమేదో కొత్తగా సృష్టించాము అన్న భ్రమలు పండితులకు తెలుసు ఎవరు చెప్పినా సత్యము వద ధర్మం చర మించి చెప్పినవారు లేరు దానిని ప్రజలలో వ్యాప్తి చేయడం కోసం అనేక రచనలు వచనంలోనూ పద్యంలోనూ నాటకీయంగాను తెలియజేసిన గ్రంథాలు అనేక వచ్చినయ్ ఈనాడు మనం ఏ నీతిని ఉదహరించినా అది పాతదే మనమేదో సృష్టించామని ఆనంద పడఅవసరం లేదు ఇప్పుడు నేను చెప్తున్నది కూడా ఆ కోవలోకే వస్తుంది మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ ప్రకృతి మనకు ఇచ్చిన ప్రసాదం ఈ జీవితం వంద సంవత్సరాలు ముందు మనం ఉండబోవు 100 సంవత్సరాల ముందు ఉండడం అంటే యోగ నిద్రలో క్షణంలో వెయ్యో వంతు కళ్ళు తెరిచి ఈ అద్భుతమైన సృష్టిని చూడడానికి మనకు దక్కిన ఈ అపూర్వమైన అవకాశాన్ని ఈ అవకాశాన్ని ఈర్ష్య అసూయలతో వ్యర్థ పందాలతో చేయి దాటుకుంటున్నాం.ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రకృతి మన చేతిలో నుంచి జారిపోయి కనుమరుగైపోతుంది దానిని తిరిగి తీసుకురాగలడా ఈ మనిషి ఇది నాది ఇది నేను అని ఎంతో గర్వంతో ఉన్న మనిషి తన శరీరం కూడా తనది కాదు అన్న విషయం మరిచిపోతున్నారు మన తాత ముత్తాతల రక్తంతో మనకు ఈ శరీరం వచ్చింది ఈ జీవనధారణ ను మన పిల్లలకు అందించి మనం వెళ్ళిపోవలసిన వాళ్ళమే తప్ప శాశ్వతంగా ఉండే వాళ్ళం కాదు మరి ఈ కొద్ది కాలంలో మనకు ఈ కొట్లాటలు ఈ పరస్పర ద్వేషంలు ఎందుకు ఒకరిపై ఒకరు పితూరీలు చెప్పుకోవడం ఒకరు చేసిన పని మరొకరికి నచ్చకపోవడం దానితో విభేదాలతో కలతలు కలహాలు రావడం సొంత కుటుంబంలోనే సామరస్యం లేకుండా పోయింది ఈ రోజులలో వాటిని వదిలి వేసి మనం సుఖంగా బ్రతకడానికి ప్రయత్నం చేసి ఎదుటివారిని కూడా సుఖంగా బ్రతికేలా మనం ప్రయత్నిద్దాం.
==========================
సమన్వయం . డా. నీలం స్వాతి
==========================
సమన్వయం . డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి