కృష్ణదేవరాయలు ఒకసారి శత్రువులపై దాడి చేయడానికి సైన్యంతో బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక నదిని దాటవలసి వచ్చింది. ఆ సమయంలో, ఆస్థాన జ్యోతిష్కుడు ఇలా అన్నాడు, “మహారాజా!, ఈ రోజు మంచి రోజు కాదు. వచ్చే సోమవారం యుద్ధానికి దిగితే విజయం ఖాయం" అన్నాడు.
ఆ మాటతో కృష్ణదేవరాయలు అయోమయంలో పడ్డారు.
అన్ని రోజులు పోరును వాయిదా వేస్తే శత్రువు అప్రమత్తమవుతాడు. అతను ఊహించనప్పుడు దాడి చేస్తేనే విజయం దక్కుతుందని కృష్ణదేవరాయలు లోలోపల అనుకున్నా, జ్యోతిష్కుడు చెప్పిన తర్వాత ఆయనలో సందేహాలు తలెత్తాయి. కనుక రాయలవారు ఈ విషయమై తెనాలి రామకృష్ణుడి సలహా అడిగారు.
తెనాలిరాముడు జ్యోతిష్కుడిని పిలిచాడు.
"అందరి ఆయుష్షు గురించి చెప్తుంటారు కదా! మరి మీరెన్ని సంవత్సరాలు బతుకుతారో చెప్పగలరా?" అని తెనాలిరాముడు అడిగాడు.
అప్పుడు జ్యోతిష్కుడు "నేను ఇంకో ఇరవై ఏళ్ళు బతుకుతాను" అన్నాడు.
తెనాలిరాముడు వెంటనే కత్తిని జ్యోతిష్కుడి మెడపై ఉంచి, "నేనిప్పుడు మీ మాట తప్పని రుజువు చేయగలనా లేదా?" అని అడిగాడు.
జ్యోతిష్కుడి కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది. ఒకటే వణుకు.
"మీరు నా మాట అబద్ధమని రుజువు చేయగలరు" అని పెద్దగా కేకలు పెట్టాడు జ్యోతిష్కుడు.
“ప్రభూ! జ్యోతిష్యం అంతే...మీకు వ్యతిరేకంగా ఉన్న ఏ అంచనానైనా మీరు తలుచుకుంటే అబద్ధమని రుజువు చేయగలరు... ఇది నిజం’ అని తెనాలి రాముడు చిన్న నవ్వు నవ్వాడు.
కృష్ణదేవరాయలు నదిని దాటారు. శత్రువును ఓడించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి