సుప్రభాత కవిత ; -బృంద
సొగసులెన్నో కొలువైన
జగతి లోని రంగులు
రోజు దాటి పోగానే
వాడిపోవు హంగులు

కొంత కాలపు జీవితాలు
కొత్త వెలుగుల పుంతలు
చిత్తమెంతో  నిర్మలమైన
స్వఛ్ఛమైన నవ్వులు

లేవు అతిశయాల అహాలు
కావు ఎవరికీ శత్రువులు
ఉన్నదరినే ఉత్సాహంగా
ఊయలూగు పువ్వులు

పాల మబ్బులు ఆగిపోయి
నిలిచి చూచె అబ్బురంగా
తారలన్నీ కలిసి వచ్చి
తోటలోన విరిసెనేమా అని!

కొండలైనా కోనలైనా
లోయలైనా బయలైనా
సంబరాలు చిందించు
కోటి కుసుమాల రాశులు

అందరి బ్రతుకు దారులూ
పూలదారులైపోవు
చదును చేసి కోరుకున్న
మొక్క నాటి పూలకోసం చూడాలి

కలుపులన్నీ ఏరివేసి కాపుకాసి
పూలు పూయు తరుణం కోసం
ఓరిమిగా ఎదురుచూసి
జీవితాన గెలవాలి

క్షణక్షణం మనుగడలో
పోరాటం తప్పదు...
ఆరాటం తీరాలంటే
అలుపన్నది లేక పోరాడే తీరాలి

గెలుపునిచ్చే వెలుగులకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు