జపాన్ మహిళా శక్తి;- - యామిజాల జగదీశ్
 ఒన్నా బుగీషా పురాతన జపాన్‌లో మహిళా యోధులు. వీరి యుద్ధ కళలో శిక్షణ పొందారు. వీరు కత్తులు, ఈటెలు, విల్లంబులు వంటి ఆయుధాలను ప్రయోగించడంలో నిపుణులు. యుద్ధ కాలంలో తమ ఇళ్లను, కుటుంబాలను రక్షించుకోవడానికి వీరు శిక్షణ పొందారు.  ఒన్నా బుగీషా ధైర్యసాహసాలకు పెట్టింది పేరు.
ఈ మహిళా యోధులను సమురాయ్‌లతో పోల్చడానికి వీల్లేదు. కానీ వారు జపనీస్ చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించారు.  వారు తరచుగా కళలు, సాహిత్యంలో చెరగని ముద్ర వేశారు.  వీరు యుద్ధభూమిలో మగవారికి ధీటుగా పోరాడేవారు.
ఒన్నా బుగీషా యుద్ధ పరాక్రమాన్ని ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు.

కామెంట్‌లు