మౌనంగా మది సొదలే
మంత్రమైన ప్రార్థనలు
కమ్మిన కారుమబ్బులు
కురవకనే మరలాలని
నివేదనలు.
మనసులోని మర్మమంతా
మాటిమాటికీ తెలపలేక
రెప్పమూసి కళ్ళు నింపి
కన్నీరే అర్ఘ్యంగా అంజలులు!
బరువుగ మారిన అంతరంగపు
ఆర్తిని ఎరిగిన అంతర్యామికి
అలజడులు తొలగించి
అనుగ్రహించమని దోసిలొగ్గిన
నమ్మకాలు
చిక్కుముడుల సమస్యలన్నీ
ఒక్కసారిగ భరించలేక
చక్కబెట్టి దీవించమని
ముక్కలైన మనసు చేసే
ఆక్రందనలు.
తడియారని గాయాల
సుడిగుండపు వేగంలో
చుట్టు తిరుగుతూ చేస్తున్న
నిరంతరపు నిశ్శబ్ద యుధ్ధాలు
నీ రాకతో పరిష్కారం
నీ చూపుతో విజయం
నీ దయతో ఆరోగ్యం
నీ కరుణతో నే మా బ్రతుకులు
ఆదరించి బ్రోవమనుచు
ఆదిత్యునకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి