ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం
 ఏ ఇంట్లో నైనా ఆడపిల్లలు ఎక్కువగా  అద్దంలో  తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ  ఉంటారు  పరిశీలనగా చూసేవాడికి ఆ పిల్ల తన అందాన్ని సొగసును అద్దంలో చూసుకుని ఆనందిస్తుంది అని ముచ్చట పడిపోతాడు  నిజానికి అర్థం ఆదర్శం ఆపాదమస్తకాన్ని అద్దంలో చూయించి నీలో ఉన్న లోపాలు ఇవి వాటిని సరి చేసుకో అని చెప్పడానికి ఏర్పడ్డ  దర్పణం  తల దువ్వుకుంటాం ఎందుకు  చిందరవందరగా ఉన్న జుట్టు చూడడానికి వికారంగా ఉంటుంది  దువ్వెనతో దానిని సరి చేసినట్లయితే  చూడడానికి అందంగా ఉంటుంది దానివల్ల ముఖానికి అందం కూడా వస్తుంది  అలాగే ప్రపంచానికి ఆదర్శప్రాయమైన  వాల్మీకి మహర్షి వ్యాసులవారు మనకు అందించిన భారత రామాయణాలు ప్రతి ఒక్కరికి ఆదర్శాలు.వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో ప్రతి వాక్యం ధర్మబోధ చేసేదే  ఏ పుట తీసి ఒక శ్లోకం చదివినా అది ఒక నీతిని నీకు తెలియజేస్తుంది  నీ జీవిత ఆశయానికి ఆదర్శంగా నిలబడాలి అంటే ఏం చేయలో ఆ శ్లోకం నీకు అర్థమయ్యేలా చెప్తుంది అలాగే వ్యవస్థలో వారు రాసిన భారతంలో మీ ఇష్టం వచ్చిన ఒక్క పద్యాన్ని తీసుకొని  దాని అర్థ తాత్పర్యాలను అవగాహన చేసుకున్నట్లయితే  న్యాయబద్ధమైన జీవితాన్ని ఎలా గడపాలో తెలియజేస్తుంది  ఎప్పుడు తన తప్పును తాను తెలుసుకుంటాడో ఆ మానవుడు  ఆ తప్పును తిరిగి చేయడానికి ప్రయత్నం చేయడు ఏ పరిస్థితులలోనైనా  నీవు రోడ్డు మీద వెళుతున్నప్పుడు చిన్న కంకర నీకు  తగిలి ఇబ్బంది పెడితే దానిని తీసి ప్రక్కన పారవేసే ధైర్యం నీకు ఉంటే ఇతరులకు నీకు వచ్చిన కష్టం లాంటిది వారికి రాకుండా ఉంటుంది అని నీకు అర్థమవుతుంది
వ్యాసుల వారి వ్రాసిన భారతంలో ఇతరులు ఏది చేస్తే ఏది మాట్లాడితే నీ మనసు బాధను అనుభవిస్తుందో  అలాంటివి ఇతరులకు చేయవద్దు  అనే ఒక్క వాక్యం మనకు తెలిస్తే జీవితం మొత్తం  సమాజానికి ఆదర్శప్రాయంగా నడుచుకునే వ్యక్తిగా తయారు కావడానికి  సంసిద్ధుడవుతాడు  కనుకనే ఏ భాషలోనైనా ఏ వ్యక్తి అయినా ఒక్కసారి అటు రామాయణం కానీ ఇటు భారతం కానీ  చదివి ఉంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఏమిటో వానికి తెలిసి  సమాజంలో వ్యక్తి ఎలా ప్రవర్తించాలో అర్థం చేసుకొని కర్మ బద్ధమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది అని  మన మునులు రుషులు అనేక ఉపన్యాసాల ద్వారా చెబుతూ ఉంటారు  వాటిని వినడమే కాదు ఆ విన్నదానిని ఆచరించినట్లయితే  మన జీవితాలు ధన్యమైనట్లే  అలాంటి వారిని చూసి అటు వ్యాసమహర్షి ఇటు వాల్మీకి మహర్షి ఎంత ఆనందిస్తారో ఒక్కసారి   ఆలోచించండి.
=================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు