అనుగ్రహం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 మన విజయానికి కిటుకు 
మనం మనసారా కోరుకుంటున్నదాన్ని పొందడమే
మనం ఏ పని చేస్తున్నా 
చేయాల్సింది పూర్తి చేయాలి
శక్తి వంచన లేకుండా ఉద్యమించాలి
జీవితాన్ని ధారపోసే వారిని 
జీవితం మోసం చేయదు 
మన లోపమేమిటో ఎక్కడుందో తెలిసినా 
సవరించుకోలేకపోవడం
కనీస ప్రయత్నం కూడా చేయక పోవడం
అపజయానికి పూర్తి నిదర్శనం 
మనసులో స్థిరముద్ర దాల్చినప్పుడే 
మన లక్ష్యం చెరిగిపోదు 
అదే జీవితాంతం 
విజయం వైపు నడిపిస్తుంది
మనను తప్పక అనుగ్రహిస్తుంది!!
**************************************


కామెంట్‌లు