శ్రమైక నౌకలు; - డా . గౌరవరాజు సతీష్ కుమార్
 ఒకవ్యక్తిని అభిమానించేవారు
ప్రేమించేవారు,వాంఛించేవారు, 
ఆలంబన కోరుకునే వారు 
ఆవ్యక్తి నుండి కేవలం 
విజయం మాత్రమే కోరుకుంటారు! 
వర్తమానాన్ని శాసించేది
భవిష్యత్తును గుప్పిట్లో బిగించేది
విజయమే!
ఆ విజయం ఊరకే రాదు 
నిబద్ధత, మేధస్సు, ఓర్పు, 
సాహసం, ఆలోచన, ఆకాంక్ష 
ఇవే మనను విజయతీరాలకు చేర్చే 
నిత్య శ్రమైక నౌకలు !!
**************************************

కామెంట్‌లు