వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి
 అనేకమంది భక్తులకు  కొన్ని భక్తి వాక్యాలు  భోజనం చేసేటప్పుడు ఆ ఆహారం మీద భక్తితో  చేసినట్లయితే అది ప్రసాదం అవుతుంది  ఆకలికి భక్తి తోడైతే ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటాం  ఉపవాసం అంటే భోజనం లేకుండా ఉండడం అని అర్థం చెప్తారు కానీ ఉప అంటే ప్రక్కనే వాసము అంటే ఉండడం ఎవరి ప్రక్కన ఉండడం భక్తి కలిగిన వాడు దేవుని ప్రక్కన ఉంటాడు అలా దేవునిపై భక్తితో  ఉన్నవాడిని  ఉపవాస దీక్షలో ఉన్నాడు అంటారు  నీటిని భక్తితో ఇస్తే అది తీర్థం అవుతుంది  యాత్రకు భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది  ఎప్పుడు సంగీతానికి భక్తి  కలుస్తుందో అది కీర్తనలు అవుతుంది త్యాగరాజ  కొన్ని వేలు మనకు అందించారు  ఇంటిలో భక్తి   ప్రవేశిస్తే అది దేవాలయం అవుతుంది దేవాలయం లో భక్తి ప్రవేశిస్తే దానిని సేవ అంటారు పనిలో భక్తి ఉంటే పుణ్య కర్మ అవుతుంది  భక్తి ప్రవేశిస్తే  మనిషి జ్ఞాని అవుతాడు ప్రపంచంలో ఒక అభిప్రాయం ఉంది  ధన ధాన్యాలు పొలం  ఎక్కువగా ఉన్నవాడు ధనవంతుడు  ఏ రోజు కూలి చేసుకొని ఆరోజు పొట్ట నింపుకొనేవాడు దరిద్రుడు  పేదవాడు అని అంటారు  దీనికి ఏమైనా కోల బద్ద ఉన్నదా అని ఆలోచించినప్పుడు  మనిషి మనస్తత్వంలో ఉన్న  ప్రవర్తనను బట్టి అతను బీదవాడా తను కూడా అన్న విషయాన్ని మనం నిర్ణయించవలసి ఉంది  డబ్బు లేని వాడు నిరుపేదను అని అనుకుంటాడు  కానీ  మనిషికి కావలసిన తనo ఏమిటి అని ఆలోచించినప్పుడు  మంచితనం ఉండాలి పవిత్రంగా ఉండాలి  ఎలాంటి తప్పులు చేయకుండా ఎలాంటి అబద్ధాలు చెప్పి పొట్ట పోసుకోకుండా ఉన్నవాడు  నిజమైన ధనవంతుడు  నీవు సాధారణ మనిషివే కావచ్చు  కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంతా గొప్పగా కనిపించేలా జీవించు ఒకరి కోసం కాదు  నీ జీవితం  మీ ఆత్మసాక్షి   మీ నిర్ణయం.
ఇంటిలో అమ్మమ్మ ఉంటే  ఆ ఇంటికి అనారోగ్యం రాదు  ఎలాంటి పెద్ద  రుగ్మత వచ్చినా సరే ఆమె వంటింటి చిట్కాలను  వాడి గంటలలో ఆ జబ్బును పొగొడుతుంది  వెల్లుల్లి ప్రతి కూరలోనూ వాడే వస్తువు  దీనిలో గొప్ప సహజమైన రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది  అందువల్ల ఇది బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే  సెక్స్ కి  సమర్థవంతమైన సహజ నివారణ  ఇందులో కాలుష్యం అనే కాంపోనెంట్ ఉంటుంది  ఇది  బ్లడ్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది  దీనిని తప్పకుండా తేనెతో కలిపి తీసుకుంటే రక్తపు విషతుల్యం పోతుంది  భోజనం చేసేటప్పుడు వేడి వేడి అన్నంలో రెండు రెబ్బలు వెల్లుల్లిని అన్నంలో పెట్టి  కొంచెం మాగిన తర్వాత తింటే  శరీరంలో ఉన్న అనేక రుగ్మతలకు మందుగా పనిచేసి  మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది  జీర్ణక్రియను సక్రమంగా ఉంచుతుంది  అందుకే ప్రతి గృహిణి ప్రతి కూరలో ఈ వెల్లుల్లి తప్పకుండా    వాడి   తీరతారు.
========================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు