ఆదిత్యుని అనుగ్రహం
అవనికి సౌభాగ్యకరం
అంతరంగపు ఆవిష్కారం
అనంత కృపా సాగరం
సర్వశక్తి స్వరూపం
ఆనంద దాయక వరం
అమృతం వర్షించి
ఆదరించే అపురూపం
పాపారణ్యాన్ని దహించి
పావనులను చేసి
పరితాపము బాపే
పరమ పవిత్ర నామము
సుడిగాలిలా దౌర్భాగ్యాన్ని
ముక్కలుగా చెదరగొట్టి
నడసంద్రంలో నావను
తీరానికి తోసుకుపోయే స్నేహం.
అజ్ఞానమనే చీకటిని
అంతరింపచేసి ఆదరించే
అంతులేని వెలుగులందించే
అప్రతిహతమైన అభిమానం
ఎదురుచూసే వారి మనసును
మయూరంలా పురివిప్పి
ఆనందనాట్యమాడేలా చేసే
నల్లని మబ్బుల సమూహం
అనారోగ్యాల రెక్కలను
ముక్కలు కాదు పిండిని చేసి
మరల మొలకెత్తనివ్వని
వజ్రసదృశ్యమైన ఆయుధం
కఠినమైనది కష్ఠతరమైనదీ
కరుణించనిదీ కల కానిదీ
కనిపించనిదీ అనిపించేదీ
కోమలమైన సూర్యానుగ్రహం
అవిరళంగా అది వర్షించే వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి