ఈ శతకము వివిధ రకముల వృత్తములలో వ్రాయ బడినది.
===========================================
క్రొత్త వృత్తములు.
==============
21.
ఇంద్రఫలా -భ, మ, గ, గ.
పుట్టెడు కష్టంబుల్ కల్గెన్
నెట్టగ నా జీవంబంచున్
గట్టిగ నీ పాదాబ్జంబుల్
పట్టితి మేలొందన్ కృష్ణా!//
22.
వాత్యా -భ,య,గ,గ.
నీలఘన మేఘశ్యామా!
పాలకుడ వీవే శౌరీ!
దాలిమిని జూపంగన్ రా
వేల? పరమేశా!కృష్ణా!.//
23.
పతిసీరా, సరళ -మ, భ, గ, గ.
సంసారంబున్ త్యజియింతున్
దాసోహంబంచును భక్తిన్
నీ సేవల్ చేయగ నిల్తున్
నీ సాన్నిధ్యంబున కృష్ణా!.//
24.
హంసరుత -మ,న,గ,గ.
జీవత్మా!హరి! ముకుందా!
భావావేశముగ పిల్తున్
రావయ్యా!వరద!కావన్
నీవే మా గురువు కృష్ణా!.//
25. క్షమా -మ,ర,గ,గ.
శ్రీరంగా యంచు నిన్ దల్తున్
జేరంగన్ సన్నిధానంబున్
భారంబున్ దీర్పగన్ రావా!
గారంబున్ జూపుచున్ కృష్ణా!.//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి