ఆనందం మహదాధందం;- - యామిజాల
ఆ బంధం
మధురం మధురం

అమ్మమ్మ, తాతయ్యల వద్ద నిద్రపోవడం అనేది పిల్లలకు ఒక అద్భుత వరం. ఓ గొప్ప సమయం. అనుభూతి. 
 
వారి తలుపులు తెరుచుకునే ఉంటాయి
పిల్లలు చేరువవడానికి. పిల్లల రాకతోవారి హృదయాలు ఎంతలా వికసిస్తాయో చెప్పలేం.

పిల్లల అరుపులతో ఆనందంతో ఆటలతో బామ్మలకూ తాతయ్యలకు కొత్త శక్తినిస్తాయి. ప్రేమను పంచుకుంటాయి.
 
 పిల్లలతో కలిసి తినే ప్రతిదీ రుచికరమే. 
 కౌగిలింతలలో ఉత్సాహం నిండి ఉంటుంది.

పిల్లల ఆటపాటలు వారిని గతంలోకి మరీ ఎక్కువగా బాల్యంలోకి నడిపిస్తాయి. అప్పుడు కలిగే ఆనందాన్ని మనవలు మనవరాళ్ళతో పంచుకుంటారు.

పెద్దల ఆశీస్సులు
పిల్లల కృతజ్ఞతలు 
ఓ మధురానుభూతి
దివ్యానందం.

ఇది తెలిసిన పిల్లలు 
క్షణం కూడా కోల్పోకూడదనుకుంటారు
ప్రతి చిన్నపనిలోనూ
తాతయ్యలను బామ్మలనూ
చూసుకుంటారు..
 
ఎప్పటికప్పుడు చైతన్యవంతులవుతారు
పరస్పర బంధం బలపడటానికి
ఇవన్నీ అవసరమే


కామెంట్‌లు