తెల్ల తెల్లని ఉల్లిగడ్డ
మెల్ల మెల్లగా వచ్చింది
పల్లెలు అన్ని దాటింది
పట్నం ఏమో చేరింది
బస్తివాసులు చూశారు
రొక్కం తీసుకు వచ్చారు
ఉల్లిగడ్డలు కొన్నారు
సంచిలోన పోశారు
ఇల్లు చేర వచ్చారు
నీళ్లలోన వేశారు
మీది పొరను తీశారు
కంచంలో నా పెట్టారు
వారు కత్తి చేతపట్టారు
గబగబ దాన్ని కోశారు
ఎక్కి ఎక్కీ ఏడ్చినారు
ఉల్లి చూసి నవ్వింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి