గ్రంథాలయం
ఎందరికో జ్ఞాన స్థావరం
ఎందరో మేధావులకు
ఓ తరగతి గది
ఎందరో శాస్త్రవేత్తల రెటీనా
ఎందరో సాధకుల రచనలకు
గొప్ప నిలయం.
కోట్లాది జ్ఞాన సంపదను
కలిగి ఉన్న మెదడే
గ్రంథాలయం
చదవడానికి వచ్చిన వ్యక్తిని
కొత్త సవాళ్లను జయించే చోదక శక్తి
పుస్తకాలయం
నేటికీ పుస్తకం
ఆలోచనా శక్తినిచ్చి
ప్రశ్నించే అవకాశాన్ని కల్పించి
మన సంతకం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది
స్నేహం, శత్రుత్వం,
యవ్వనం, పదోన్నతి
వృద్ధాప్యం
సమానత్వం ,
నిర్భయ హోదాకు ప్రతిబింబం కాలం సంపాదించిన ఖజానాలో
శాశ్వతంగా నిలిచే సమానత్వపు కిటికీలు నిరీక్షణలో కఠిన సత్యాలను
జ్ఞాన సంపదను ప్రసాదించి
జీవనపయనానికి
వెన్నెముకవుతుంది గ్రంథాలయం
అందుకే
పుస్తక ప్రపంచం
ఓ అందమైన ప్రపంచం
జ్ఞాన విజ్ఞాన ప్రపంచం అనడం
అతిశయోక్తి కాదు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి