తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారమని ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ దీపా జాదవ్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి తల్లి పాల వారోత్సవాలు జరుపుకుంటారు. బిడ్డ జన్మించిన గంటలోపే తల్లి బిడ్డకు పాలివ్వాలని తెలియజేయడానికే ఈ వారోత్సవాలు నిర్వహిస్తారు.
బిడ్డకు ఎల్లప్పుడూ తల్లిపాలు పట్టడమే శ్రేయస్కరం. కానీ కొంతమంది తల్లులకు పాలు పడవు. ఇటువంటి సందర్భంలో బిడ్డకు పోత పాలు పట్టవలసి వస్తుంది. పోత పాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి
1. పాడి పశువుల పాలు
2. డబ్బా పాలు
ఆవు, గేదె పాడి పశువుల పాలు బిడ్డకు ఇవ్వవచ్చు. పాడి పశువుల పాలు అందుబాటులో లేనప్పుడు పాలు పట్టించవచ్చు. డబ్బా పాలు బజారులో పౌడర్ రూపంలో లభిస్తుంది.
పాడి పశువుల పాలైన డబ్బా పాలైన సీసాలో పోసి బిడ్డకు పట్టాలి. పోత పాలు పట్టించేవారు సీసా పట్ల కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తలు పాటిస్తేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.
జాగ్రత్తలు
1. సీసాను, పాలపికను సబ్బు నీళ్లతో చక్కగా కడగాలి
2. కడిగిన తరువాత వేడి నీళ్లతో శుభ్రం చేయాలి
3. పడుకునే సమయంలో బిడ్డకు పాలు పట్టించ వద్దు
4. బిడ్డకు పాలు తాగించేటప్పుడు ఒళ్ళో పడుకోబెట్టి పాలు పట్టించాలి.
5. పాలు పట్టించిన తరువాత బిడ్డకు కొంతసేపు భుజంపై ఎత్తుకొని బిడ్డ వీపుపై నెమ్మదిగా తడుతూ ఉండాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి