'శంభో!శతకపద్యములు ;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 (కందములు )
===========
86.
 అడుగులు తడబడు చుండెను
గడగండ్లను మోయ లేను!గడతేర్చవయా!
కడు వేదనతో నీదరి
నడచుచు వచ్చితి దయ గొని ననుఁ గను శంభో!//
87.
 కరముల యజింతు నిన్నే
 మురిపెము దీరగ మనమున మ్రొక్కెద  నయ్యా!
చరణములే విడువక నే 
సరగున గోరితి హర!నినుఁ శరణము శంభో!//

88.
 అలసిన వేళల నిన్నే


బిలిచితి బలుమారులు హర! పిలుపును వినుమా!
కలవర మాయె మనంబున
 కలతను దీర్పగదె!గరళ కంఠా!శంభో!//
89.
 తరుణేందుధరా!శంకర!
కరుణాకర!నీదు మోము కన్నుల గాంచన్
నిరతము కోరితి విను మొర!
తరియించగ దర్శన మిడు దయగొని శంభో!//
90.
తిరు శైలంబున గొలువై
వరముల నిచ్చెడి శివ!నిను ప్రార్థింతునయా!
స్థిరమగు జ్ఞానము నిడుమా!
మరిమరి నిను వేడెడి నను మరువకు శంభో!//
కామెంట్‌లు