బుద్ధుని దివ్యోపదేశం;-సి.హెచ్.ప్రతాప్
 వెయ్యి పనికి రాని మాటల కంటే.. మిమ్మల్ని శాంతియుతంగా మార్చే ఒక్క మంచి మాట మేలు." ఈ సూక్తి గౌతమ బుద్ధుడు బోధించింది.బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడి జన్మస్థలం నేపాల్‌లోని లుంబిని ప్రాంతం. చరిత్రకారుల అంచనా ప్రకారం ఆయన క్రీ.పూ. 563లో జన్మించాడు. బుద్ధుడు తన 29వ ఏటనే తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలు కనుగొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించాడు.తర్వాత 35 ఏళ్ల వయసులో ధ్యానం ద్వారా ప్రపంచంలోని కష్టాలకు కారణాలను, పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు.అలా ప్రస్తుత బిహార్‌లోని గయ ప్రాంతంలో ఓ చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడని చెబుతారు. ఆ ప్రాంతానికే 'బుద్ధ గయ' అనే పేరు వచ్చింది.అతని దివ్యదేశాలలో మచ్చుకు కొన్ని :
1. ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు. ప్రతి పనినీ ఒక ధ్యానంగా చెయ్యి.
2.కాలాన్ని వృధా చేయడమంటే, నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే.
3.మన లోపల శత్రువు లేనంత వరకు మన బయటి శత్రువు మనను భయపెట్టలేడు.
4.మనిషికి నిజమైన ఆనందం లభించేది అతడి ఆలోచనల్లోనే.
5.ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టుగానే, మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి.
6.ఒక్క అన్నదానం చేసిన ఈరోజు నీవు నాలుగు దానాలు చేసిన ఫలాన్ని పొందావు. రుజువర్తన కలవారికి, జ్ఞానులకు ఇలాంటి దానం చేస్తే మహాఫలప్రదమనే విశ్లేషణ ఉంది
7. ఈ విశ్వంలో ఏదీ కోల్పోలేదు: గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రకారం మనం చేసిన పని ఫలితం తిరిగి మనకే వస్తుంది. కాబట్టి, ఏ పని అయినా శ్రద్ధా, ప్రేమతో చేయాలి. జీవితాన్ని ఆనందంగా గడపాలి.
8. ప్రతిదీ మారుతుంది: మార్పు ఈ ప్రపంచంలో స్థిరంగా ఉంటుంది. మీ చుట్టూ పరిస్థితులు ఎలా మారినా మీరు దానిని స్వీకరించడం నేర్చుకోవాలి. అప్పుడు ప్రశాంతంగా జీవించగలరు.
9. వర్తమానంలో జీవించండి: గతం గురించి ఆలోచించడం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం కంటే వర్తమానంపై దృష్టి పెట్టాలని బుద్ధుడు ప్రజలను కోరారు. 

కామెంట్‌లు