అవయవాలు మరణాన్ని జయిస్తాయి!!?;- డా.ప్రతాప్ కౌటిళ్యా
 మనం మరణాన్ని జయిస్తామో లేదో కానీ మనిషిలోని అవయవాలు మాత్రం మరణాన్ని జయిస్తాయని కొంత పరిశోధనాల తర్వాత చెప్పగలం. నిజానికి మనిషి తన మరణ శాసనాన్ని ముందే రాసుకు వస్తాడు. అంటే మన డిఎన్ఏ లోని బ్లూ ప్రింట్ లో మన అవయవాలు కణాలు కణజాలాలు ఎంతకాలం వరకు జీవించగలవో అంతకాలం వరకు జీవించి పనిచేస్తాయి. ఆ తర్వాత వాటి పనితనం ముగుస్తుంది. దీన్నే మనం మరణం అంటున్నాం. మనిషి వంద నుంచి వందా పాతిక సంవత్సరాలు బ్రతికి ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. అంతేతప్ప అంతకన్నా ఎక్కువ బ్రతకలేం. కానీ చిన్న సమాచారం ఏమిటంటే మనిషి పుట్టుక కన్నా ముందు పుట్టిన మనలోని అవయవాలు మనల్ని ఆశ్చర్యపరుస్తున్నవీ. గుండె కన్ను కిడ్నీ లివర్ లాంటి అవయవాలు 400 మిలియన్ల సంవత్సరాల పూర్వమే పుట్టినట్లు సమాచారం. మనిషి మెదడు కూడా అంతకు పూర్వమే పుట్టినట్లు సమాచారం. అంటే మనిషి పుట్టుక పూర్వమే పుట్టిన అవయవాలు మనిషి ఆయుషును పెంచడానికి తోడ్పడుతాయన్న అద్భుతం మనల్ని ఆకర్షిస్తుంది. మన లోని అవయవాల డీఎన్ఏ బ్లూ ప్రింట్ ను మనం మార్చుకోవడానికి పరిణామ ప్రక్రియ సహకరిస్తుందని మనం నమ్మాలి. అవయవాల కణజాలాలు కణాలు దీనికి సహకరిస్తాయని గుర్తించాలి. మొత్తంగా మనిషి జీవితకాలం కన్నా ఎక్కువ జీవిత కాలాన్ని అవయవాలు జీవిస్తాయని నిరూపించాలి. అప్పుడు మరణాన్ని జయిస్తాం అని చెప్పగలం. కానీ ఖచ్చితంగా అవయవాలు మాత్రం మరణాన్ని జయిస్తాయి.
డా.ప్రతాప్ కౌటిళ్యా

కామెంట్‌లు