శంకు కథ ;- ముంజులూరి కృష్ణ కుమారి

  బడి నుంచి రాగానే శంకు ఇంటిముందున్న డ్రమ్ము లోంచి లోటా తో నీళ్లు తీసుకొని కాళ్ల మీద పోసుకున్నాడు. మరో లోటా నీళ్లు మోహం మీద ఇంకో లోటా నీళ్లు చేతులమీద దిమ్మరించుకున్నాడు.
అదిచూసి అమ్మ "శంకు! నీళ్లు అలా పారబోయకు. పుంపు సరిగా రావడం లేదు. జాగ్రత్త గా వాడుకోవాలి."అనిఅరిచింది.
నువ్వెప్పుడూ అలాగే అంటావు. ఆకలి గా ఉంది. ఏదన్నా పెట్టు, అన్నాడు శంకు. రోజూ శంకుకి అమ్మ ఎంత చెప్పినా వినడు. నీరు వృధా చేస్తాడు. వాళ్ళ బస్తీ లో పుంపు నుండి వరసలో నిలబడి తెచ్చిన నీళ్లు అలా పారబోస్తుంటే అమ్మ ప్రాణం ఉసూరు 
 మంటుంది.శంకుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుంది.
      మర్నాడు శంకు ఇంటికి వచ్చి డ్రమ్ము లో లోటా ముంచితే చేయి లోపలికి వెళ్ళింది కానీ నీళ్లు తగలలేదు."అమ్మా!నీళ్లు లేవు "అని అరిచాడు.
పుంపు దగ్గర బిందె పెట్టాను. మన వంతు వచ్చాక పట్టి నన్ను పిలు. నేను గిన్నెలు తో్ముతున్నాను."అంది అమ్మ. శంకు పుంపు దగ్గరకు వెళ్లి తమ వంతు వచ్చేవరకు నిలబడేసరికి కాళ్ళు నొప్పెట్టాయి. బిందె నిండగానే అమ్మ నువ్వు పిలిచి సాయం పట్టి డ్రమ్ము లో పోసాడు. అబ్భా!అమ్మ నీళ్లు ఎంత కష్టపడి తెస్తుందో!అందుకే నన్ను వృధా చేయొద్దని కోప్పడుతుంది. అనుకుని నీళ్లను జాగ్రత్తగా వాడటం మొదలు పెట్టాడు.

కామెంట్‌లు