వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి.
 హస్త సాముద్రికం అనేది ఒక శాస్త్రం  చేతిలో ఉన్న రేఖలను చూసి  ఈ రేఖ వల్ల ఏ ఫలితం వస్తుంది ఈ రేఖ వల్ల ఈ చెడు జరుగుతుంది  భవిష్యత్తులో నీకు వచ్చే కలతలన్నీ ఈ గీత వల్ల వస్తాయి అని చెబుతూ ఉంటారు  ఇతను చెప్పే ప్రతిదీ నిజమేనని నమ్మి ఎంతో ఆనందిస్తూ ఉంటారు  తన హస్తాన్ని చూయించుకున్న వాళ్ళు  కానీ వాడు చెప్పేది నిజమా కాదా అని ఆలోచన ఉండదు  నిజంగా వారు చెప్పేది  సత్యమే అయితే  ప్రధాన గీతలతో పాటు వాటికి అడ్డంగా కూడా కొన్ని గీతాలు ఉంటాయి  అంటే ఆ మంచి జరగకుండా పోవడం  కోసం అది సహకరిస్తుంది  దానిని కూడా ప్రపంచ ప్రఖ్యాత  హస్త సాముద్రిక వేత్త  కేరో కూడా చెప్పలేదు  అది కాక చేతులు లేని వారు కొంతమంది ఉంటారు పుట్టుకతో పాపం  అలాంటి వారికి భవిష్యత్తు లేకుండా ఉంటుందా  వేరే కాలు చూసి  రేఖలు చూసి అతని భవిష్యత్తును చెబుతారా?  కనుక నమ్మి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు  మానవ ప్రయత్నం సక్రమంగా ఉంటే ప్రతి  పని విజయవంతం అవుతుంది అని నేర్చుకోవాలి.
జీవితం చాలా చిత్ర విచిత్రాలతో కూడినది  జీవితం అన్న శబ్దం  ద్వైతమా అద్వైతమా  నిర్ణయించే శక్తిమన మేధకు అందదు  జీవితం అనేది ఒక శబ్దమా రెండు శబ్దాలా  జీవి తనువుతో పని చేసే ప్రయాణాన్ని జీవితం అని అనవచ్చు కదా  మరి ఈ జీవి లోపల ఉంటుంది శరీరం పైన కనిపిస్తూ ఉంటుంది  ఈ రెండు ఒకటిగా ఉన్నది కనుక ఇది ద్వైతము అంటాము  రెండు ఉన్నాయి కనక అద్వైతము అంటాము  ఈ తనువు కు ఏమైనా  ఈ శరీరానికి ఏవైనా లక్షణాలు ఉన్నాయా  లోపల జీవి ఏది చెపితే అది చేయడానికి సిద్ధంగా ఉంటుంది  ఇలా చేయాలి అన్న ఆలోచన రాదు  జీవి కనుక లేకపోయినట్లయితే  ఈ తనువు ఒక ఆట బొమ్మలా తయారవుతుంది తప్ప  ప్రత్యేకంగా  తనను తాను సంతరించుకునే స్థితి లేదు అన్నది స్పష్టం.ఎవరికి వారు తాను ఏ పని చేస్తున్నాడో అది నూటికి నూరుపాళ్ళు మంచిది అన్న అభిప్రాయంతోనే దానిని ప్రారంభిస్తారు  అదే పని ఇంకొకరు చేయడం ప్రారంభించినప్పుడు  ఆ పనిలో ఉన్న కష్టం ఏమిటో అది చేసేటప్పుడు ఎదుర్కోవలసిన సమస్యలు ఏమిటో అతనికి చెప్పడానికి ముందు ఉంటాడు  కానీ తాను చేసే ఆ పని మాత్రం  తప్పకుండా విజయాన్ని పొందుతుంది ఎలాంటి అభ్యంతరాలు ఉండవు అన్న ధీమాతోనే బయలుదేరతాడు  అలాకాకుండా ఇతరులకు ఏ సలహాలు అయితే ఇచ్చావో ఆ సలహాలను నీవు ఆలోచించి దాని వెనుక ఉన్న కష్టనష్టాలను కూడా  తెలుసుకొన్న వాడివి కనుక వాటిని పరిహరించుకుంటూ  ముందుకు వెళితే నిన్ను నీవు సరి చేసుకున్న వాడవు అవుతావు  ఈ ప్రపంచంలో తప్పు చేయని వ్యక్తులు అంటూ ఎవరు ఉండరు  అయితే ఆ చేసిన తప్పును తిరిగి చేయకూడదు  అలా చేసినట్లయితే క్షమించడానికి కూడా అతగాడు అర్హుడు కాదు అన్న విషయం స్పష్టం.
============================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు