విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ రబ్బర్లు వితరణ; - వెంకట్ మొలక ప్రతినిధి

  మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పూర్య నాయక్ తండాలో తెలంగాణ విద్యావంతుల వేదిక  ఆధ్వర్యంలో నాయకులు రాష్ట్ర కార్యదర్శి కే రవీందర్ గౌడ్ మరియు కోశాధికారి గౌరారం గోపాల్  గార్ల చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియు పెన్నులు పెన్సిల్స్ అందించారు. 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేయుటలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశంసిస్తూ విద్యావంతుల వేదిక గత 14 సంవత్సరాల నుండి ప్రభుత్వ బడులలో చదివే పేద విద్యార్థిని విద్యార్థులకు బ్యాగులు డిక్షనరీలు పెన్నులు వర్క్ బుక్కులు తదితర. వస్తువులను మౌలిక మైనటువంటి అవసరాలను బడిఈడు పిల్లలకు అందిస్తూ వారు పాఠశాలలకు సంతోషంగా వచ్చి నాణ్యమైన విద్యను పొందుటలో తెలంగాణ విద్యావంతుల వేదిక సహకారం ఎల్లప్పుడు అందిస్తుందని తెలియజేశారు.
కామెంట్‌లు