డబ్బు ఉన్న
దొడ్డ మనిషి
బుడ్డ మనిషి
గోడు వినడు!
డబ్బు లేని
బుడ్డ మనిషి
అడ్డమైన పనులన్నీ
గొడ్డులాగ చేస్తాడు
పాపం! చిత్తుగ తాగేస్తాడు!
డబ్బు ఉన్న
పెద్ద మనిషి
అడ్డమైన
దారులంట
పేదవాళ్ళ రక్తాన్ని
పీల్చి పీల్చి
పిప్పిచేస్తాడు!
చివరికున్న
రక్తపు బొట్టును
దయ తల్చి
దానంగా
వాళ్ళకే మిగిల్చి
"పొండిరా
గొడ్డుచాకిరీ మనుషుల్లారా
మళ్ళీ
నింపుకు రండిరా
అసలైన సిసలైన
అతి చిక్కని
రుధిరాన్ని"
అంటూ దయతో
సాగనంపుతాడు!!
************************************
దయ ;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి