'కృష్ణా!'శతకము.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 ఈ శతకము వివిధ రకముల వృత్తములలో వ్రాయబడినది 
============================================
క్రొత్త వృత్తములు.
==============
51.
అనుకూలా -భ,త, న, గ, గ.
యతి -7.
దోసము లెన్నో దొలగగ నిన్నే
వాసిగ మ్రొక్కన్ బలములు కల్గున్
దాసిగ నిల్తున్ దయగొన లేవా!
చేసెద సేవల్ స్థిరముగ కృష్ణా!//
52. భుజంగశిశురుతము.
న, న, య.
పిలుపులు వినుము నిన్నే
పిలిచితి వరద!రావా!
నిలిపితి మదిని శౌరీ!
వలపుల దొరవు కృష్ణా!//
53.
రుచిరా -న, భ, య.
ఘనముగా జని యశోదా
తనయుడా పరుల గూల్చన్
వినతితో పొగడిరే నిన్
గనుచు గోపికలు కృష్ణా!//
54.
మాయాసారీ -న, య, మ.
కఱకుదనం బేలా!నాపై
విరసము జూపంగా మేలా!
దరిసెన మీయంగా లేవా!
గరుడ విహంగా!శ్రీకృష్ణా!//

55.
సారంగశ్యామా -న, య, య.
వరదుడ!నీమ్రోల నుంటిన్
జిరునగవుల్ జిల్క వయ్యా!
దరిసెన భాగ్యంబు నీవా!
పరమును జూపంగ కృష్ణా!//


కామెంట్‌లు