కాలభైరవ అష్టకమ్;- కొప్పరపు తాయారు
 🍀శ్రీఆదిశంకరాచార్య విరచిత🍀

 శ్లో!! భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం 
భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం 
నిక్వణన్మోజ్ఞ హేమ లసత్కటిం
కాశికా పురాధి నాధ కాల భైరవం  భజే !!
భావం:
          భుక్తి _ ముక్తులనిచ్చువాడు, ప్రశస్తమైన సుందర శరీరము కలవాడు, భక్తవత్సలుడు, స్థిరమైన వాడు, సమస్త ప్రపంచమును నిగ్రహించు వాడు, నడుము నందు మోగుచున్న అందమైన 
బంగారు చిరుగంటలు ధరించిన వాడు. కాశీ నగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.
           
                *****


కామెంట్‌లు