కాలభైరవ ఆష్టకమ్;- కొప్పరపు తాయారు
🍀 శ్రీ ఆదిశంకరాచార్య విరచి 🍀

 భాను కోటి భాస్వరం భవాభ్ధితారకం పరం
 నీలకంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనం!
  కాల కాల మంబుజాక్ష మక్షశూల మక్షరం
  కాశికాపురా ధినాధ కాలభైరవం భజే !!

భావం: కోటి సూర్యుల వలే ప్రజ్వలించు వాడు, 
సంసార సముద్రమును దాటించువాడు, ఉత్తముడు, నీలకంఠుడు, కోరికలు తీర్చువాడు, మూడు కన్నుల వాడు, యమునికే యముడైన  వాడు, పద్మముల వంటి కన్నుల  కలవాడు, నాశము లేని వాడు, స్థిరమైన వాడు, కాశీ నగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను.
  
                  *****


కామెంట్‌లు