జి.ఓ.నెంబర్ 54ను రద్దుచేసే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయించుట పట్ల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు హర్షం వ్యక్తం చేసారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున న్యాయపరమైన పోరాటాలు చేసిననూ, గత ప్రభుత్వం మొండిగా, దుర్మార్గంగా వ్యవహరించిందని ఆయన గుర్తు చేసారు. నాటి ప్రభుత్వం ఇచ్చిన హామీని గాలికొదిలేసి, బలవంతంగా పాత పెన్షన్ స్కీమ్ కు ప్రత్యామ్నాయంగా జి.పి.ఎస్. విధానాన్ని ప్రవేశ పెట్టిందని ఆయన అన్నారు. ఐతే నేటి ప్రభుత్వం కూడా ఇటీవల అనగా జూలై 12న అదే విధానాన్ని అమలు చేయాలని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని తామంతా తీవ్రంగా వ్యతిరేకించామని, అందుకే యుటిఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ మరుసటిరోజే అనగా జూలై 13నే నిరసన కార్యక్రమాలు చేపట్టామని మోహనరావు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్ ని అర్ధం చేసుకుని, విడుదల చేసిన గెజిట్ ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని స్వాగతిస్తూన్నామని అన్నారు. ఐతే ఈ జీ.ఓ.నెంబర్ 54 ని శాశ్వతంగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని, ఇంకే ఇతర విధానాలనీ అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేసారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి