కవితాస్వాదనలు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కొన్నికవితలు
కురుస్తాయి
కడవలోపట్టుకో
కమ్మగాక్రోలుకో

కొన్నికవితలు
వీస్తాయి
సౌరభాలుపీల్చుకో
సంతసాలతేలిపో

కొన్నికవితలు
హారాలుగావస్తాయి
అందుకో
అలరించుకో

కొన్నికవితలు
పారుతుంటాయి
ప్రవాహములోదిగు
అమృతములాత్రాగు

కొన్నికవితలు
వంటకాలులావస్తాయి
ఆరగించు
ఆహ్లాదించు

కొన్నికవితలు
తేనెనుచిందుతాయి
స్వీకరించు
సంబరపడు

కొన్నికవితలు
అందాలొలుకుతాయి
వీక్షించు
వినోదించు

కొన్నికవితలు
శ్రావ్యంగావినబడుతాయి
ఆలకించు
ఆనందించు

కొన్నికవితలు
రమ్మనిపిలుస్తాయి
చెంతకువెళ్ళు
ఆస్వాదించు

కొన్నికవితలు
పూస్తాయి
కాంచు
కుతూహలపడు

కైతలను
తప్పకచదువు
కవులను
మదినతలచు


కామెంట్‌లు