బుద్ధిని మొదటి ప్రవచనం;- చిరసాని శైలూషి,నెల్లూరు
 సిద్ధార్థుడు సంబోధిని పొంది బుద్ధుడైన తర్వాత నేరం జరా నది ఒడ్డునున్న జలపాతం కింద ఏకాంతంగా గడిపేటప్పుడు నేను ఒక శ్రమణునితో కానీ లేక ఒక బ్రాహ్మణులతో కానీ సమీపించి వినయ విధేయతలతో అతనికి సేవ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన కలిగింది  ధర్మాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడానికి నేను ఏ బ్రాహ్మణితోనో లేక ఏ శ్రమణుడితోనో వినయ విధేయతలతో గడపాలంటే ఈ ప్రపంచంలో ఎక్కువగా ఎక్కడ దేవతల్లో గాని మారుల్లో కానీ మానవుల్లో కానీ ఇంతకంటే ఉన్నత ధార్మిక ప్రగతిని సాధించిన వాడు నాకు కనిపించడం లేదు అని అనుకున్నాడు  తనలో తానే  అలాగే ఏకాగ్రత జ్ఞానం స్వేచ్ఛలను పరిపూర్ణంగా ఉంచుకోవడానికి నేను వినయ విధేయత ప్రదర్శిస్తూ ఒక శ్రమణుడితో  బ్రాహ్మణులతో గడపాలంటే ఈ ప్రపంచంలో ఏకాగ్రత(సమాధి) జ్ఞానం స్వేచ్ఛలో నాకంటే ఉన్నత స్థితిలో ఉన్న శ్రమణుడు గాని బ్రాహ్మణుడు గాని ఎవరూ లేనప్పుడు నేను అనుకో పూర్వకంగా తెలుసుకున్న ధర్మానికి నేను విధేయుడను అయితేనో అని భావించాడు.బుద్ధుడు మళ్ళీ ధ్యానంలో ఉండగా నేను కనుగొన్న ధర్మం చాలా గొప్పది లోతైనది ఉత్తమమైనది ప్రకాశంవంతమైనది తర్కానికి సూక్ష్మమైనది తేలికగా అర్థమయ్యేది కానిది  జ్ఞానులు మాత్రమే అర్థం చేసుకోగల గంభీరమైనది మానవులు ఇంద్రియ సుఖ లాలసులు వారికి కార్య కారణ సంబంధ సిద్ధాంతం అంత తేలికగా అర్థంకాదు ఉపాధు లు తెలియ చేయాలని అనుకోటo తృష్ణ ను రాగాల నుంచి విముక్తమవడం మామూలు జనాలకి సాధ్యం కాదు మరి అలాంటప్పుడు నేను తెలుసుకున్న ధర్మాన్ని వారికి బోధించిన ఆ జనానికి అది అర్థం కాదు సరే కదా అది వారికి ఎదురీత నాకు వ్యర్థ ప్రయాసవుతుందని తలపోసి ఈ ఉన్నతము గంభీరము సూక్ష్మము దురవగాహన ఈ సత్యాన్ని మామూలు జనం గ్రహించలేరను కొని ధర్మబోధ గావించడానికి ఆసక్తి చూపలేదు.బుద్ధని మనసులోని ఆలోచనలు పసిగట్టిన బ్రహ్మసహంపతి బ్రహ్మ లోకం లోంచి వచ్చి బుద్ధుని ఎదురుగా సాగిల పడి నమస్కరించి అర్హంతుడా  గతంలో కూడా మీరు అనుకున్నట్లే ఉన్నతులు ఇదే ధర్మాన్ని గౌరవిస్తూ జీవించారు భవిష్యత్తులో కూడా అలానే జీవిస్తారు ఉన్నతులైన మీరు కూడా ఇదే ధర్మాన్ని గౌరవిస్తూ జీవిస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు అత్యున్నతము అనితరము అయిన ఈ ధర్మం ప్రపంచానికి అందదేమోనని భయపడి న బ్రహ్మసహం పతి తిరిగి బుద్ధుని వద్దకు వచ్చి వినమృడై ధర్మబోధ చేయమని ప్రాదేయపడ్డాడు బుద్ధుడు బ్రహ్మసహం పతితో ఓ బ్రహ్మ నేను గ్రహించి అర్థం చేసుకున్న ధర్మాన్ని లాలస ద్వేషాలతో నిండిన వారు కళ్ళలో కొద్దిపాటి దుమ్ము ఉన్న వాళ్ళు అర్థం చేసుకో లేరు అన్నాడు
----------------------------------------------
సమన్వయం ; - డా. నీలం స్వాతి 

కామెంట్‌లు