వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి.
 జీవితాన్ని అధ్యయనం చేసిన ఠాగూర్  జీవిత సత్యాలను తెలియజేస్తూ  తన గీతాంజలి ఖoడ కావ్యాల్లో ఒక ఖండిక లో జీవిత పరమార్ధాన్ని తెలియజేస్తారు  నేను మరణించిన తర్వాత నా గొప్పతనాన్ని చెప్పుకుంటూ నాలో ఉన్న విశిష్టతను ఇతరులకు తెలియజేయడం కోసం దుఃఖిస్తూ బాధపడుతూ  నా స్నేహితులు  బంధువులు  ప్రయత్నం చేస్తారు దుఃఖిస్తూ  ఆ మాటలు నేను జీవించి ఉండగా నాతో చెబితే ఎంత ఆనందిస్తాను  అదే నాలో లోపాలను కూడా ఎంచి ఈ లోపాల వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది అని తెలియజేస్తే వాటిని తిరిగి జీవితంలో చేయకుండా జాగ్రత్త పడతాను కదా  అంటూ తన భౌతికకాయం పైబడి  దుఃఖిస్తున్న వారిని గురించి చెప్పిన అద్భుతమైన కవిత  దానిలో కూడా ఆధ్యాత్మికతను జోడించి  అందమైన పదాలతో మనలను ఆకర్షించే కవి రవీంద్రనాథ్ ఠాగూర్ తప్ప మరొకరు లేదు.బాలలకు విద్యాభ్యాసం చేసేటప్పుడు మొదట దిద్దిoచేది అ తర్వాత  ఎందుకు అలా ప్రారంభిస్తారు అని అడిగితే  మన దగ్గర సమాధానం లేదు అకారానికి గుర్తు అమ్మ  నీవు గర్భంలో ఉన్నప్పటి నుంచి ఇంత వాడిని చేసి నీకు జీవాన్ని ఇచ్చినది అమ్మ కనక  ఆమెను మొదటి స్మరించాలి  రెండవ అక్షరం ఆ అంటే ఆనందం  జీవితం ఆనందమయం గా ఉండాలి అన్న అభిప్రాయం  దానికి తగినట్లు ఆత్మవిశ్వాసం ఉంటే ఆ జీవికి తిరుగే లేదు  ప్రతి అక్షరం లోను  జీవిత పాఠం  ఉంది  అక్షర మంటేనే క్షరం కానిది నాశనం లేనిది వంగనిది  నీకు ఆనందం కావాల్సి వచ్చినా ఆదాయం కావలసి వచ్చిన నీవు దానిని సాటించడం కోసం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి  నిజానికి నిజమైన ఐశ్వర్యం ఆ ఆత్మవిశ్వాసమే  దానిని అలవర్చుకుంటే చాలు ప్రపంచాన్ని జయించవచ్చు.ఒక ముని మౌనం వహించడానికి  ఒక ఋషి సనాతన ధర్మాన్ని ఆచరించడానికి  మూల కారణం తెలుసుకుంటే  ప్రతి ఒక్కరూ ఆ మార్గాన్ని అవలంబించాలి అని నిర్ణయించుకుంటారు  మౌనంగా ఉన్న వాడిని చూడండి వారికి కలహాలు రావు  ఎవరినైనా ఒక మాట అన్నా లేక వాడు మనల్ని ఒక మాట అన్నా దానికి సమాధానాలు వస్తే ఆ మాటకు మాట పెరగడం చివరకు అది బంధాన్ని  వేధించే వరకు వెళ్లడం  సహజంగా మనం చూస్తూనే ఉన్నాo  అందుకే వేదవి దులు  నిన్ను   పీడిస్తున్న జబ్బులు  కోరికలే  కోరికలు పెరిగితే  క్రోధం మోహo తో పాటు  మిగిలిన శత్రువులు అన్ని  నీలో ప్రవేశించి మీ జీవితాన్ని నాశనం చేయడానికి వస్తాయి  వాటిని ఆహ్వానించవద్దు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు  వాటిని తన స్వాధీనం చేసుకోవడం కోసమే మునులు మౌనంగా  రుషులు సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు.
----------------------------\
సమన్వయం ; డా. నీలం స్వాతి 


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం