'కృష్ణా!'శతకము.;-టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర

ఈ శతకము వివిధ రకముల వృత్తములలో వ్రాయబడినది 
========================================
క్రొత్త వృత్తములు.
============
31.
మౌళిమాలికా -ర, య, గ, గ.
గానలోలుడా!రావేలా!
వేణువూదుచున్ శ్రీనాధా!
దీననైతినయ్యా!రంగా!
మౌనమేలనోయీ!కృష్ణా!.//
32.
పద్మమాలా -ర, ర, గ, గ.
చక్కనౌ నీదు రూపంబున్
సొక్కుచున్ గాంచిరా మౌనుల్
మ్రొక్కగా భక్తిగన్ నిన్నే
ప్రక్కనే నిల్తువో కృష్ణా!.//
33
వృష-ర, స, గ, గ.
దుర్మదాంధుల ద్రుంచంగా
కర్మలన్నియు కాల్చంగా
ధర్మమార్గము జూపంగా
నిర్మలాత్మవు శ్రీకృష్ణా!//
34.
దిగీశః, ఈశ, ముద్ర.
స, జ, గ, గ.
విన వేల?శౌరి!బాధల్
యనఘా!భజింతు నిన్నే
ప్రణతిన్ కరంబు మోడ్తున్
గనరావ!నన్ను కృష్ణా!//
35.
కౌచమారః -స, త,  గ.
కరుణావార్థీ!మురారీ!
దరిచేరంగా  దయాళూ!
మురళీలోలా!పదంబుల్
నిరతంబున్ గొల్తు కృష్ణా!//

 

కామెంట్‌లు