నేను ఆకాశవాణి విజయవాడలో పని చేస్తున్న సమయంలో నా మాటలు విని తాను కూడా తనలాగా రేడియోలో చేరాలి అన్న కుతుహులంతో దేవానంద రెడ్డి నన్ను కలిసి వివరాలు తెలుసుకొని ఆ తర్వాత తాను కూడా అనౌన్సర్ గా విజయవాడ కేంద్రానికి వచ్చాడు అక్కడ తాను ఉన్న ఇంటి దగ్గరలోనే శివ నాగి రెడ్డి గారి కార్యాలయం ఉంది వారితో పరిచయం అయింది రెడ్డికి ఏదో మాట్లాడే సందర్భంగా నా విషయం వచ్చి నా పూర్తి పేరు చెప్పి తాను రావడానికి కారణం వారేను అని తెలియజేస్తే ఆయన ఆశ్చర్యపోయాడు రేడియో అంటే అంతా బ్రాహ్మణ కూటమి కదా మనవాడు ఎలా వచ్చాడు అని ఆశ్చర్యపోయాడు ఒకసారి నన్ను కలవడానికి ప్రయత్నం చేశారు అని దేవానందు చెప్పిన తర్వాత ఒకరోజు వాడి దగ్గరకు వెళ్ళాము ఇద్దరం కలిసి.అక్కడకు వెళ్ళిన తర్వాత వారు మర్యాదలు చేసి వారిని గురించి క్లుప్తంగా తెలుసుకుని నా విషయాలు సమగ్రంగా తెలియచేసి ఆరోజు చక్కగా కాలక్షేపం చేసాం తిరిగి వచ్చేటప్పుడు వారు రాసిన పుస్తకాలలో ఒక గ్రంథాన్ని తీసుకొని వచ్చాను అది చదివిన తర్వాత చరిత్రను కూడా ఎంత చక్కగా సామాన్య ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో వ్రాయవచ్చు కదా అని అభిప్రాయం నాకు కలిగింది వారు వారానికి ఒకసారి సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవారు ఒక వారం నేను కార్యక్రమంలో పాల్గొన్నాను నారాయణరావు గారు గోళ్ళ లాంటి మిత్రులు కూడా అక్కడ హాజరయ్యారు వారందరితో పరిచయం అయింది రెడ్డిగారిలో నేను గమనించింది వారు మితభాషి అనవసరమైన పదాన్ని ఒకటి కూడా వాడరు.ఆయనకు స్నేహం అంటే ఇష్టం ఉండదు తక్షణ అవసరాలు తీర్చుకోవడానికి వచ్చేవాడు అంటే ఆయనకు గిట్టదు మనసులు కలిసి మంచి ప్రవర్తన కలిగి సామాజిక స్పృహ కలిగిన వారు మాత్రమే ఆయనకు మిత్రులుగా ఉంటారు వారితో ఒక్కసారి పరిచయం అయిన తర్వాత నిజమైన మిత్రుడు ఎవరు కూడా వారికి దూరంగా వెళ్లడానికి ప్రయత్నం చేయడు ఏదైనా మాట చెబితే దానిని నెరవేర్చి కాని నిద్రపోరు ఏదైనా కార్యక్రమంలో వక్తగా వారు పాల్గొంటే వారి ధోరణి గంగా ప్రవాహం లాగా సాగిపోతుంది ఏ పదానికి వెతుక్కోరు జన భాష తప్ప గ్రాంథికాన్ని వాడరు వారి రచనలు చదివినప్పుడు ఎక్కడ అనవసరమైన వాక్యాలు కనపడవు క్లుప్తంగా స్పష్టంగా చెప్పడం ఆయన పద్ధతి అందుకే వారి మైత్రి అంటే నాకు ఇష్టం
---------------------------------------
సమన్వయం ; డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి