చేతికి చిక్కిన సీతాకోకచిలుకను
విడిచిపెట్టడానికి
ఇష్టం లేక
మరీ గట్టిగా పట్టుకుంటే
దాని సున్నితమైన రెక్కలు నలిగిపోతాయి
మన నుంచి విడిపించుకోవడానికి
చేసే ప్రయత్నంలో
దాని రెక్కలు
రాలిపోతాయి.
అయితే
దానిని అరచేతిపై ఉండనిస్తే, కొంత సమయం
అక్కడుండటానికి
ఇష్టపడొచ్చు.
కాబట్టి,
ఈ జీవితంలో,
నేను సీతాకోకచిలుకల వంటి వ్యక్తులను ప్రేమించడం నేర్చుకున్నాను
వారు ఇక్కడ ఉన్నప్పుడు వారి ఉనికిని ఆస్వాదిస్తాను
వారు బయలుదేరే సమయం వచ్చినప్పుడు డీలా పడక
వారప్పటిదాకా పంచిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటాను
ఇందువల్ల ఓ లాభం
ఉంది...
వారిష్టపడితే
ఏదో ఒక రోజు
మళ్ళీ నన్ను
చూడటానికీ
పలకరించటానికీ రావచ్చు
ఒకవేళ అలా రాకున్నా
నలిగిపోను...
ప్రతి అందమైన తోటకీ
అనేకానేక సీతాకోకచిలుకలు వస్తుంటాయి
పోతుంటాయి...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి