బుద్ధుని మహా పరి నిర్వాణం;-చిరసాని శైలూషి,నెల్లూరు.

సామాన్యంగా జీవులు మరణించినప్పుడు నిర్యాణము అని అనుకుంటూ ఉంటారు  కానీ తనను తాను తెలుసుకున్న  మహానుభావులు అహం బ్రహ్మాస్మి అని అనుభవంతో తెలుసుకున్న బుద్ధ భగవాన్ శంకరాచార్య  మలయాళ స్వామి రమణ మహర్షి లాంటి వారి మరణాన్ని  నిర్వాణము అంటే తిరిగి జన్మ లేనివారు అని అర్థం  శంకరాచార్యుల లాంటివాడు  పునరపి మరణం పునరపి జనంనo అన్నారు  పుట్టిన వాడు మరణిస్తూ ఉంటాడు మరణించిన వాడు తిరిగి పుడుతూ ఉంటారు అని  చెప్పారు  బుద్ధుని  సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం కోసమే శంకరాచార్యులు వారు  జన్మించారు అని ఒక వాదం ఉంది.మా నాన్నగారు ఆరుమళ్ల సుబ్బారెడ్డి గారు  మలయాళ స్వామి వారిని గురించి రాస్తూ  వారిని బుద్ధునితో పోలుస్తూ  వారు ఇరువురకు కలిగిన  కొన్ని సంఘటనలను  తెలియచేస్తూ  అసంగానంద గౌతమ బుద్ధులు అన్న పుస్తకాన్ని వ్రాశారు తపస్సు చేసేటప్పుడు  బుద్ధ భగవానుడు ఎలాంటి అనుభవాలను  పొందారు  అలాంటిది స్వామీజీకి కూడా ఉన్నాయి  అని ఉదాహరణలతో చెప్పారు  దాదాపు  బుద్ధ భగవానుని సిద్ధాంతాలను  భగవద్గీత ఆధారంగా  కఠోపనిషత్తు ఆధారంగా  తెలియజేశారు  స్వామీజీ  శిష్యునిగా చేరిన తరువాత  స్వామి సమత్వనంద అన్న పేరుతో  ఆ పుస్తకాన్ని వ్రాశారు  ఇలా సమాజంలో బుద్ధ భగవానుడు ఏది  సామాన్య మానవులకు తెలియజేయాలని అనుకున్న రో  దానిని  వీరు కూడా అలా ప్రచారం చేశారు.బుద్ధుడు రాజగృహం లోని గృభకూట పర్వతం మీద విహరిస్తుండగా ఆయనను సందర్శించిన వసకారుడు తలవంచి బుద్ధిని నమస్కరించి బుద్ధినితో  అజాతశత్రువు వజ్జీయుల మీద యుద్ధానికి స న్నర్ధులవుతున్నాడు శక్తి సంపన్నులైన వారి దర్పమనచి తుదముట్టడించాలి అనుకుంటున్నాడు అందుకు రాజు భగవానుని అనుమతి వేడుకుంటున్నాడు అని తెలియజేశారు  వీసనకర్ర వీడా. ; స్తూ సపర్యలు చేస్తూ బుద్ధునికి వెనుకగా నిలబడి ఉన్న ఆనందునితో బుద్ధుడు ఆనందా వజ్జ గణరాజ్యాల వారు తరచూ సమావేశం అవుతూ ఉంటారా అని అడిగాడు సమావేశాలు ఏర్పాటు చేసుకోటమే కాదు శ్రద్ధశక్తులతో వాటిలో పాల్గొంటున్నారు కూడా అని బదులు ఇచ్చాడు ఆనందుడు.
===================================
సమన్వయం;  ; డా . నీలం స్వాతి 


కామెంట్‌లు