కాలేజీకి వెళ్ళకపోతేనేం..;- - యామిజాల జగదీశ్.

 ఆయన అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత. పేరు రే బ్రాడ్బరీ. 
రే ఓమారు చెప్పిన విషయం ఆయన మాటల్లోనే....
"మాది పేదకుటుంబం. నాకు పంతొమ్మిదేళ్ళు. ఫీజు కట్టడానికి
డబ్బుల్లేకపోవడంతో కాలేజీకి వెళ్ళలేకపోయాను. ఎలాగూ కాలేజీలో చదవలేను కాబట్టి లైబ్రరీకైనా వెళ్ళి పుస్తకాలు చదువుదామనుకున్నాను. వారానికి మూడు రోజులు తప్పనిసరిగా లైబ్రరీకి వెళ్ళేవాడిని. అక్కడ వీలున్నన్ని పుస్తకాలు చదివాను. ఒకవేళ కాలేజీకి వెళ్ళి ఉంటే  నేనన్ని పుస్తకాలు చదివుండకపోవచ్చు. అయితే ఇరవై ఏడేళ్ళకే లైబ్రరీలో దాదాపుగా అన్ని పుస్తకాలూ చదివేశాను. వాటి నుంచి బోలెడంత తెలుసుకున్నాను. నాకప్పుడు అనిపించింది. 
ఒక వ్యక్తి ఏదైనా కోరుకున్నప్పుడు, అతను లేదా ఆమె దానిని సాధించడానికి ఏదో ఒక నిర్మాణాత్మక  మార్గాన్ని ఎంచుకోవాలి. దానిని ప్రణాళికాబద్ధంగా ఆచరణలో పెట్టాలి. ఈ భూమ్మీద  మనకంటూ చాలా చిన్న ప్రదేశం మాత్రమే కేటాయించబడింది. మనిషి తనకిచ్చిన ప్రతి దానినీ తిరిగి తీసుకోగల ప్రకృతిలో మనం జీవిస్తున్నాం. ప్రకృతి ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.  మానవులైన మనం ప్రకృతి ఇచ్చే దానిని సద్వినియోగం చేసుకోవాలి తప్ప నిర్లక్ష్యం తగదు. ఇది నిజం. దీనిని ఎప్పటికీ మరచిపోకూడదు. ఏదో ఒక రోజు మనందరినీ నిర్మూలించడానికి ఏదో ఒక ప్రమాదం పొంచే ఉంటుంది. అప్పుడు  సముద్రపు అలలు మనల్ని ముంచెత్తడానికి ఆలోచించదు. కనుక మనిషి మూర్ఖంగా ఆలోచించక శక్తిమంతుడై అప్రమత్తంగా ఉండాలి. చైతన్యవంతుడై ఉండాలి...."
బ్రాడ్బరీ తన మొదటి కథను "ది లేక్"ని 13.75 డాలర్లకు విక్రయించాడు. ఆ తర్వాతే అతను  రచయితగా స్థిరపడ్డాడు. ఆయన మొదటి కథల సంకలనం డార్క్ కార్నివాల్  పేరుతో 1947లో వెలువడింది. ఈ పుస్తకాన్ని  సమీక్షిస్తూ , విల్ కప్పీ బ్రాడ్‌బరీని కొనియాడుతూ గొప్ప రచయిత అవుతాడని పేర్కొన్నాడు.
బ్రాడ్‌బరీ మొదటిసారిగా 25 వేల పదాలతో రాసిన కథ గెలాక్సీ సైన్స్ ఫిక్షన్‌లో 1951 ఫిబ్రవరి లో ప్రచురితమైంది. అయితే దీనినే మరో ఇరవై అయిదు వేల పదాలకు పొడిగించమని గెలాక్సీ సంపాదకవర్గం సూచించగా  బ్రాడ్‌బరీ  అలాగేనని రాసి దానికి " 451 డిగ్రీల ఫారన్ హీట్  అని రాశాడు. ఈ నవల అతనికి విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది.
బ్రాడ్‌బరీకి ప్రతిరోజూ ఏదో ఒకటి రాస్తుండేవాడు.  ఈ జీవితకాల అలవాటుకు అతను రెండు విషయాలు చెప్పాడు. మొదటిది, అతను మూడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని తల్లి 1923 మూకీ చిత్రం ది హంచ్‌ బ్యాక్ ఆఫ్ నోట్రే డేమ్‌లో లోన్ చానీని చూడటానికి తీసుకువెళ్లడం... రెండవది 1932లో జరిగిన మరొక సంఘటన. ఒక కార్నివాల్ ఎంటర్‌టైనర్ నాకు భవిష్యత్తునివ్వడం. ఆ తర్వాతే నేను పూర్తి సమయాన్నీ రాతకోతలకు వినియోగించానన్నాడు బ్రాడ్బరీ.
బ్రాడ్‌బరీ మొదట మ్యాజిక్ చేసేవాడు. ఒకవేళ తాను రచయితను కాలేకపోయుంటే మాంత్రికుడినయ్యేవాడినని అన్నాడు.
బ్రాడ్‌బరీ అనేక రకాల ప్రభావాలను పేర్కొన్నాడు. రాబర్ట్ ఫ్రాస్ట్ , విలియం షేక్స్‌పియర్ , జాన్ స్టెయిన్‌బెక్ , ఆల్డస్ హక్స్‌లీ థదితరులు తన అభిమాన రచయితలని, వారితో తరచుగా చర్చలు జరిపేవాడినని రాసుకున్నాడు . స్టెయిన్‌బెక్ నుండి, అతను నిష్పాక్షికంగా ఎలా వ్రాయాలో నేర్చుకున్నాడట.
బ్రాడ్‌బరీని సైన్స్-ఫిక్షన్ రచయితగా పేర్కొనేవారున్నారు.
అతను తన జీవితంలో ప్రతిరోజూ కవిత్వం చదివేవాడు. ఇష్టమైన రచయితల గురించి మననం చేసుకునేవాడు. సన్నిహితులతో చెప్పుకునేవాడు.  
ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో, బ్రాడ్‌బరీ కవిత్వం, డ్రామా క్లబ్‌లలో చురుకుగా పాల్గొనేవాడు. నటుడిగా మారాలనుకున్న అతను పెరిగేకొద్దీ రాయడంపై సీరియస్ అయ్యాడు.  జీన్నెట్ జాన్సన్ బోధించే చిన్న-కథలపై అధ్యయనం చేశాడు. ఉపాధ్యాయులు అతని ప్రతిభను గుర్తించి, రచనపై అతని ఆసక్తిని ప్రోత్సహించారు. అతను వార్తాపత్రికలను విక్రయించిన రోజులున్నాయి. తనను లైబ్రరీలే పెంచి పోషించాయంటాడు. యూనివర్సిటీలపై  నమ్మకం లేదంటాడు. లైబ్రరీలను నమ్ముతాను ఎందుకంటే నేను ఉన్నత పాఠశాల నుండి బయటకు వచ్చాక కాలేజీలో చేరే వసతి లేక డిప్రెషన్ లో ఉన్న సమయంలో లైబ్రరీలే నాలో పెను మార్పును తీసుకొచ్చాయన్న బ్రాడ్బరీ. 1920 ఆగస్టు 22న జన్మించారు. 2012 జూన్ అయిదున తనువు చాలించారు.



కామెంట్‌లు