సంస్కారం...! ;- కోరాడ నరసింహా రావు!
తల్లి క్షే త్రం లో... తండ్రి వేసిన బీజానికి ఆ అను రాగాలతో మొలకెత్తిన మొక్కలం...! 
 అమ్మా, నాన్నల లాలన,పాలనే
  మనలను వృక్షాలుగా పెంచి , పోషించినాయి....! 
 కన్న తల్లి, దండ్రులకు... 
  అలసి - సొలసినవృద్దాప్యంలో
  కాస్తంత నీడ నిచ్చి , సేద దీర్చ
  లేక పోతె...ఆతల్లి,దండ్రులమ నసు ఎంత క్షోభిస్తుంది...!
  రేపు మనమూ బిడ్డలకు జన్మ నిస్తాము...అనురాగంతో పెంచి పెద్ద చేస్తాము... మన బిడ్డలు మనల్నీ గాలి కొదిలేస్తే.... 
   ఊ హించుకొండి...!! 
 మనం ఉన్నతంగా ప్రవర్తిస్తే
  ఆ సంస్కారంతోనే మన పిల్ల లూ మనని చూసు కుంటారు! 
మంచి బిడ్డలుగా బ్రతకండి... 
 మంచి బిడ్డల్ని ఈ సమాజానికందించండి...!! 
         ******

కామెంట్‌లు