'కృష్ణా!'శతకము.;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 ఈ శతకము వివిధ రకముల వృత్తములలో వ్రాయబడినది 
===========================================
క్రొత్త వృత్తములు.
--------------------
1.చతురీహా -జ, భ, గ , గ.
==================
భరించు నాథుడ!శౌరీ!
కరంబు మోడ్చుచు నిన్నే
నిరంతరంబుగ గొల్తున్
బరంబు జూపుమ!కృష్ణా!/
2.
 సింహలేఖ -జ,ర, గ, గ.
పరాకు జూపకో!నన్ జే
ర రావ!భక్తిగన్ నిన్నున్
విరాళి గొల్చెదన్ శ్రద్ధన్
మురారి!మాధవా!కృష్ణా!//
3.
శ్యామా -త,స గ,గ.
అన్నా!యనుచు నీ మ్రోలన్
విన్నాణముగ కైమోడ్తున్
నిన్నే పిలుతు గోవిందా!
పున్నెంబులిడుమా కృష్ణా!//
4.
వారిశాలా -జ,త,గ,గ.
భజింతు నయ్యా!మురారీ!
ప్రజాపతీ గోపబాలా!
విజేత వంచున్ సభక్తిన్
యజింతు నిన్నెప్డు కృష్ణా!//
5.
వితానయోగః -జ,మ ,గ,గ.
సదా శుభంబుల్ భాగ్యంబుల్
చిదాత్మ!నీవీయన్ బాధల్ 
యుదారతన్ దీర్చే శౌరీ 
ముదంబుగా దల్తున్
కృష్ణా!//

కామెంట్‌లు