విద్యార్థులకు పుస్తకాల పంపిణి
 తెలంగాణ ఆదర్శ పాఠశాల,బచ్చన్నపేటలో 10వ. తరగతి చదువుకొని 2024 వార్షిక పరీక్షలలో 9.8 గ్రేట్ సాధించిన కొన్నె గ్రామానికి చెందిన మల్గ వరుణ్ రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం,బాసరలో ప్రవేశం పొందిన సందర్భంగా ప్రార్థనా సమావేశంలో అబ్దుల్ కలామ్ ఫౌండేషన్,వరంగల్ వారి ఆధ్వర్యంలో అబ్దుల్ కలామ్ గారి జీవిత చరిత్ర నా దేశ యువజనులారా అనే పుస్తకం , మెడల్ ప్రిన్సిపాల్ శ్రీమతి కృష్ణవేణి గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అబ్దుల్ కలాం ఫౌండేషన్ జనగామ జిల్లా సభ్యులు ఎం.సుధాకర్,ఎస్ నర్సింహులు,జె.చంద్రశేఖర్,వి.రామకృష్ణ పాల్గొన్నారు.
 

కామెంట్‌లు