న్యాయాలు-572
నాంతరీయక న్యాయము
*****
నాంతరీయకం అంటే అవసరమైనంత మేరకే గ్రహించుట.
అవసరమైనంత వరకే అర్థము గ్రహించుట అని అర్థము.
ఏ విషయం అయినా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనసుకు చేరుతుంది. మనసుకు చేరిన లేదా గ్రహించిన విషయాల్లోని మంచి చెడులను వివేకంతో బుద్ధి నిర్ణయిస్తుంది. ఇలా బుద్ధి ద్వారా బాహ్య అంతర్ ప్రక్షాళన చేయబడిన దానిలో అవసరమైనది ఏదో అంతవరకు అంతరంగం గ్రహిస్తుంది.గ్రహించాలి కూడా .
అంతరంగం అవసరమైనంత మేరకే గ్రహించాలంటే ముందుగా మనస్సును అధీనంలోకి తీసుకుని రావాలి . మనసు అధీనంలోకి రావాలంటే దానికి ఇష్టమైన ఆహార పానీయాలైనటువంటి జ్ఞానేంద్రియ విషయాలకు దూరంగా ఉంచాలి. జ్ఞానేంద్రియ విషయాలు అంటే దృష్టి, ధ్వని,వాసన, రుచి,స్పర్శ అని మనకు తెలుసు కదా! ముందుగా వాటి నుంచి మనసును మళ్ళించాలి. అలా మళ్ళించడానికి కావాల్సింది నేను ఎవరు? అనే ఎరుక. అదెలా సాధ్యం అవుతుందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే తాళ్ళతో బంధించడం వల్ల. దాని వల్లే అంటే ఎరుక అనే తాడుతో బంధించడం వల్లే మనసు నిలకడగా ఉంటుంది.
సామాన్యంగా మానవుడి మనసు ముఖ్యంగా మూడు రకాల తప్పుడు ఆలోచనలు చేస్తూ వుంటుంది. ఆ తప్పుదోవ పట్టించే ఆలోచనలన్నీ అజ్ఞానం వల్లే ఉదయిస్తూ వుంటాయి. కాబట్టి ముందుగా వాటి నుంచి బయట పడాలి అంటాడు గౌతమ బుద్ధుడు.
ఆ మూడు రకాల ఆలోచనలు ఏమిటో చూద్దాం.అవి 1.తృష్ణ వల్ల కలిగే ఆలోచనలు 2.భ్రమల వల్ల కలిగే ఆలోచనలు.3.నమ్మకాల వల్ల కలిగే ఆలోచనలు.
తృష్ణలో మొత్తంగా ఇది నాది, నాకు చెందినది అనే స్వార్థపూరితమైన ఆలోచనలే వుంటాయి.రెండవ దాంట్లో జ్ఞానేంద్రియాల వల్ల కలిగే భ్రమలు, భ్రాంతులతో కూడిన ఆలోచనలు వుంటాయి. ఇక మూడవ రకమైన ఆలోచనల్లో ముఖ్యంగా మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు వుంటాయి.వీటి నుండి బయట పడితేనే మనకు ఏం కావాలో,ఏది అవసరమో అంతరంగానికి తెలుస్తుంది.
మరో కోణంలో కూడా "నాంతరీయక న్యాయాన్ని" చూద్దామా.. "అత్యాశ అనర్థ దాయకం-తృప్తికి మించిన సంపద లేదు " అనే మాట తరచూ మన పెద్దవాళ్ళ నుండి వింటుంటాం కదా!
మరి తృప్తి ఎక్కడినుంచి వస్తుంది? ఈర్ష్య అసూయలూ, గర్వం, అతిశయం,కోపం, స్వార్థం, భయం మొదలైన వాటిని మనసులో పెంచి పోషిస్తూ వుంటే తృప్తి అనేది వస్తుందా? అస్సలు రాదు. అవన్నీ విపరీతమైన తృష్ణకు, నకారాత్మకతకు సంబంధించినవి.వీటిని సకారాత్మకంగా మార్చుకోగలిగినప్పుడు మాత్రమే అవసరమైనంత తృప్తి కలుగుతుంది.అదెలాగో చూద్దాం.
ముందుగా ఉదాహరించిన విధంగా ఈర్ష్య అసూయలూ, రాగద్వేషాలు, గర్వం ,అతిశయాలు,కోపం లాంటివి మనుషులకు ఉంటాయి. అతిగా కాకుండా అవసరమైన మేరకు ఉండాలి కూడా. ఎందుకంటే ఇతరుల కంటే ఉన్నతమైన స్థాయిలో ఉండాలనే కోరిక,ఏదో సాధించాలనే తపన ఈ ఈర్ష్య అసూయలే కలిగిస్తాయి.బంధాలు అనుబంధాల విషయంలో రాగద్వేషాల స్థానం ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే.అలాగే ఆత్మాభిమానం ప్రతి వ్యక్తికీ ఉండాలి.అది ఇతరులకు అహంకారం,గర్వంగా కనిపించవచ్చు. ఇక భయం అనే దాని ప్రక్కనే భక్తి చేరుతుంది.పెద్దల పట్ల భయ భక్తులు ఉంటేనే వారు చెప్పిన హితోక్తులు విని మంచివారుగా మారే అవకాశం ఉంటుంది.
కాబట్టి "నాంతరీయక న్యాయము"ద్వారా మనం తెలుసుకోవలసిన విషయాలు ఏమిటంటే అదుపు తప్పని పై లక్షణాలు అవసరమైనంత ఉంటే అవే ఆశల నుంచి ఆశయాలుగా రూపాంతరం చెందుతాయి. అంతే కదండీ! నాతో ఏకీభవిస్తారు కదూ!.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి