ఆయన పేరు ఫ్రాంజ్ కాఫ్కా. రచయిత.
ఒక రోజు బెర్లిన్‌లోని ఒక పార్కు గుండా కాఫ్కా వెళుతుండగా, ఒక చిన్న పిల్ల కన్పిస్తుంది. తను పోగొట్టుకున్న ఇష్టమైన బొమ్మకోసం ఏడుస్తుంటుంది. ఆమెను విషయం అడిగి తెలుసుకున్న కాఫ్కా ఆ చిన్న పిల్లతో పాటు బొమ్మ కోసం వెతుకుతారు. కానీ అది దొరక లేదు.
మరుసటి రోజు కాఫ్కా తనను పార్కులో కలవమని చెప్పి ఓదారుస్తాడు. నీకు తప్పకుండా బొమ్మ దొరుకుతుంది...ఏడవకంటాడు....
చెప్పినట్లుగానే మరుసటి రోజు, కాఫ్కా ఆ అమ్మాయికి "దయచేసి ఏడవొద్దు.... నేను ప్రపంచాన్ని చూడటానికి వెళ్ళాను.... నా సాహసాల గురించి నీకు వ్రాస్తాను" అని ఆ బొమ్మ ఓ ఉత్తరం రాసిందంటూ ఆ పిల్లకు నచ్చచెప్పి ఆ లేఖను ఇస్తాడు.
కాఫ్కా జీవితాంతం వరకు ఈ కథ ఇలానే కొనసాగుతుంది.
వారి సమావేశాల సమయంలో, కాఫ్కా ఆ అమ్మాయి మనోహరంగా భావించిన సాహసాలు, సంభాషణలతో వ్రాసిన బొమ్మ అక్షరాలను చదివి వినిపిస్తుంటాడు.
చివరగా, కాఫ్కా తనే ఒక బొమ్మను కొంటాడు. ఆ విషయం చెప్పక బొమ్మ ప్రపంచ పర్యటనను పూర్తి చేసుకుని బెర్లిన చేరుకుందని చెప్పి ఆ అమ్మాయికిస్తాడు.
అయితే ఆ పిల్ల ఆ బొమ్మ తనకెంతో ఇష్టమైన బొమ్మలా లేదని చెప్తుంది.
అపప్పుడు కాఫ్కా ఆమెకు మరో లేఖనిస్తాడు.
అందులో బొమ్మ ఇలా రాసింది: "నా ప్రయాణాలు నన్నూ నా రూపాన్ని మార్చేసాయి." అని.
దాంతో చిన్న అమ్మాయి ఆ మాటలు నిజమే అనుకుని నమ్మి కాఫ్కా ఇచ్చిన కొత్త బొమ్మను కౌగిలించుకుంంటుంది. మహదానందంతో ఆ బొమ్మను ఇంటికి తీసుకెళ్తుంది.
ఈ సంఘటన జరిగిన ఏడాదికి కాఫ్కా చనిపోయాడు.
చాలా సంవత్సరాల తరువాత, ఆ అమ్మాయికి బొమ్మ లోపల ఒక ఉత్తరం కనిపిస్తుంది. కాఫ్కా సంతకం చేసిన చిన్న ఉత్తరమది. అందులో ఇలా రాసి ఉంది....
"నువ్వు ఇష్టపడేవన్నీ బహుశా దూరమైపోవచ్చు. కానీ చివరికి, ఆ ప్రేమే మరొక విధంగా తిరిగి లభిస్తుది." అని!
ఫ్రాంజ్ కాఫ్కా 1883 జూలై మూడో తేదీన జన్మించిన ఓ జర్మన్ రచయిత.
అతను రచనలు ఇరవయ్యొ శతాబ్ద సాహిత్యంలో ప్రధానమైనవిగా నిలిచాయి. ఆయన రచనలు సామాజిక అధికారిక శక్తులను ఎదుర్కొంటున్న వివిధ కథాపాత్రలతో సాగేవి. పరాయీకరణ , అస్తిత్వ ఆందోళన, అపరాధం వంటి ఇతివృత్తాలతో అతను రచనలు చేసేవాడు. అతని ఉత్తమ రచనలలో ది మెటామార్ఫోసిస్ నవల.
1924 జూన్ మూడో తేదీన కాఫ్కా కన్నుమూశాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి