నవోదయ ఉచిత శిక్షణకు ఆహ్వానం

  -ప్రాథమిక స్థాయి నుంచి పోటీ పరీక్షలకు శిక్షణ 
-పిల్లల్లో పోటీ తత్వం పెంచేందుకు ప్రయత్నం 
----------------------------------------------------------
 2025 -2026 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశం కోసం  నవోదయ నోటిఫికేషన్ విడుదలైందని, నవోదయ ప్రవేశ పరీక్ష చాలా ప్రాముఖ్యమైన ప్రవేశ పరీక్ష అయినందున దీనికి తప్పకుండా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఊషన్నపల్లి ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య తెలిపారు. బుధవారం ఆయన కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో విలేకర్లతో మాట్లాడుతూ తల్లిదండ్రుల కోరిక మేరకు, పిల్లల ప్రయోజనార్థం నవోదయ ప్రవేశ పరీక్ష కోసం ఉచిత శిక్షణను ఈనెల 21వ తారీకు నుంచి ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచి ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పోటీ పరీక్షల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు రెండు గంటల పాటు నవోదయ శిక్షణ కార్యక్రమం ఉంటుందని, పిల్లల తల్లిదండ్రుల కోరిక మేరకు పాఠశాల సెలవు రోజుల్లో కూడా రెండు గంటల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందని ఈర్ల సమ్మయ్య తెలిపారు. పాఠశాలోని 4,5 తరగతుల పిల్లలను క్లబ్ చేసి, నవోదయ శిక్షణనిస్తామని, ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4, 5 తరగతులలో చేరిన పిల్లలకు మాత్రమే ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ఊషన్నపల్లి, గంగారం, చుట్టు ప్రక్కల గ్రామాల పిల్లల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఊషన్నపల్లి గ్రామంలోని పిల్లలతో పాటు వివిధ గ్రామాల్లో ప్రయివేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకొని, వారికి ప్రత్యేకంగా ఉచిత కోచింగ్ ఇస్తామన్నారు. తాను శ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ పాఠశాలలో పని చేసిన సమయంలో అక్కడి పిల్లలకు నవోదయ ఉచిత కోచింగ్ ఇచ్చానని, తాండ్ర సాహస్ మిత్ర అనే విద్యార్ధికి నవోదయలో సీటు వచ్చిందని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇతర వివరాలకు కింది ఫోన్ నంబర్ 9989733035 లో సంప్రదించాలని ఈర్ల సమ్మయ్య కోరారు.
కామెంట్‌లు