ఈ శతకము వివిధ రకముల వృత్తములలో వ్రాయబడినది
===========================================
క్రొత్త వృత్తములు.
===========
46.
రామా -త, ర, మ.
జీవాత్మ వంచు నిన్ మ్రొక్కంగా
భావంబులోన నిల్పంగా నీ
సేవల్ సభక్తిగన్ జేయంగా
బ్రోవంగ వత్తువో శ్రీకృష్ణా!//
47.
వైసారూ (వైసారం )-త, స, మ.
నాదాత్మ!నిను ప్రార్థించంగా
నీదాసులుగ యోగుల్ రాగా
మోదంబుగ వీక్షించే నిన్
వేదాత్మ!యని కొల్తున్ కృష్ణా!//
48.
శశిరేఖా -న, జ, య.
వెలుగులు చిల్కెడి దేవా!
కలతను దీర్పగ రావా!
పిలిచితి భక్తిగ నిన్నే
తొలగగ చింతలు కృష్ణా!//
49.
భుజంగ శిశుభృత- న, న, మ.
వినుము మొరలు గోవిందా!
ఘనుడ వనుచు నీ లీలల్
అనిశము దలతున్ మ్రోలన్
బ్రణతిగ నిలుతున్ కృష్ణా!//
50.
విశదచ్ఛాయః -స, త, య, గ.
యతి - 6.
సురలున్ మౌనుల్ శుభముల్ పొందన్
గరుణావార్థీ!కమలాకాంతా!
వరదా!యంచున్ బడి మ్రొక్కంగా
దరిచేరేనిన్ దలతున్ కృష్ణా!//
===========================================
క్రొత్త వృత్తములు.
===========
46.
రామా -త, ర, మ.
జీవాత్మ వంచు నిన్ మ్రొక్కంగా
భావంబులోన నిల్పంగా నీ
సేవల్ సభక్తిగన్ జేయంగా
బ్రోవంగ వత్తువో శ్రీకృష్ణా!//
47.
వైసారూ (వైసారం )-త, స, మ.
నాదాత్మ!నిను ప్రార్థించంగా
నీదాసులుగ యోగుల్ రాగా
మోదంబుగ వీక్షించే నిన్
వేదాత్మ!యని కొల్తున్ కృష్ణా!//
48.
శశిరేఖా -న, జ, య.
వెలుగులు చిల్కెడి దేవా!
కలతను దీర్పగ రావా!
పిలిచితి భక్తిగ నిన్నే
తొలగగ చింతలు కృష్ణా!//
49.
భుజంగ శిశుభృత- న, న, మ.
వినుము మొరలు గోవిందా!
ఘనుడ వనుచు నీ లీలల్
అనిశము దలతున్ మ్రోలన్
బ్రణతిగ నిలుతున్ కృష్ణా!//
50.
విశదచ్ఛాయః -స, త, య, గ.
యతి - 6.
సురలున్ మౌనుల్ శుభముల్ పొందన్
గరుణావార్థీ!కమలాకాంతా!
వరదా!యంచున్ బడి మ్రొక్కంగా
దరిచేరేనిన్ దలతున్ కృష్ణా!//

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి