చాలా గొప్ప మాట సారి పుత్ర, నీవు నిజంగా సింహనాదమే చేశాడు గత బుద్ధుల మనసెరిగి వారు తమ శీల సమాధి ప్రజ్ఞలతో సంబోధిని పొంది అన్ని జీవులు దుఃఖాన్ని ఎడబాసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చెప్తున్నావా అని అడిగాడు బుద్ధుడు లేదు భగవాన్ అని జవాబు ఇచ్చాడు సారిపుత్రుడు భవిష్యత్తులో సంబోధిని పొంది బుద్ధుల శీల సమాధి ప్రజ్ఞలను అవగాహన చేసుకుని శీల సమాధి ప్రజ్ఞల ద్వారా సంబోధిని పొందిన నన్ను అవగాహన చేసుకుని పైవిధం గా చెప్పగలిగావా సారిపుత్ర అని ప్రశ్నించాడు లేదు భగవాన్ అని జవాబిచ్చాడు సారిపుత్రుడు మరి నీ వేలా సింహనాధాన్ని చేయగలిగావు సారి పుత్ర అని అడిగాడు బుద్ధుడు భగవాన్ గతంలోని బుద్ధులు వర్తమాన రాబోయే భక్తుల చిత్రాలను తెలుసుకోగల శక్తి నాకు లేదు.అయితే నాకు ఒక దమ్మ సంగతం మాత్రం తెలుసు గత వర్తమాన ప్రస్తుత బుద్ధులు నాలుగు సతి పఠనాల కాయానుపస్సనా వేదనానపస్సన చిత్తాను పస్సన ధర్మానుపస్సన ద్వారా చిత్త వివేకాన్ని సంతరించుకొని కామచ్చంద వ్యాపాధ ధీనమిద్ద ఉద్ధచ్చ విచికిత్స ఇంద్రియ వాంఛలు ఉద్దేశం సోమరితనం జడత్వం ఉద్విగ్గినత ధర్మసత్యాలనే ఐదు ఆటంకాలను భుజంగాలను అధిగమించి సంబోధిని పొందుతారు అన్న ధర్మం మాత్రం నాకు తెలుసు అని సారిపుత్రుడు బదులు ఇచ్చాడు బుద్ధుడు నాలంద లోని పావారి అనే మామిడి తోటలో ఉన్నప్పుడు భిక్షువులకు శిలా సమాధి ప్రజ్ఞల గురించి వాటిని సంతరించుకోవడం వల్ల తృష్ణ దృష్టి అవిద్యల నుంచి పూర్తిగా విముక్తుడై దుఃఖ నివృత్తి గావించి పునర్భవం మళ్లీ పుట్టుట లేని నిర్వాణానందాన్ని పొందే ధమ్మన్ని గురించి బోధించాడు.ఆ తర్వాత కొంతకాలానికి బుద్ధుడు ఆనందుని పిలిచి పనులు పాటలీ గ్రామానికి పయనం కట్టమన్నాడు అలాగే తగిన ఏర్పాటు చేయగా పాటలీ గ్రామానికి చేరుకున్నాడు బుద్ధుడు బుద్ధుడి పాటలీ గ్రామం చేరుకున్నాడని తెలిసి పాటలీ గ్రామంలోని ఉపాసకులు బుద్ధుని సందర్శించి వందనాలు అర్పించి తర్వాత ఒక ప్రక్కగా కూర్చున్నారు ఒక విడిది గ్రహంలో విశ్రాంతి తీసుకోమని బుద్ధుని కోరారు అలాగే అన్న బుద్ధుడు ఛీవరాలను సరిజేసుకుని బిక్షా పాత్రను తీసుకొని విడిది గృహం చేరుకున్నాడు కాళ్లు కడిగి విడిది గృహంలోని మధ్య స్తంభo ప్రక్కన తూర్పుముఖంగా కూర్చున్నాడు భిక్షు సంఘం కూడా విడిది గృహం చేరి కాళ్లు కడుక్కున్న తర్వాత పడమటి గోడకు అనుకొని తూర్పు ముఖంగా కూర్చుంది.
==================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
==================================
సమన్వయం ; డా. నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి