సుప్రభాత కవిత ; - బృంద
అన్ని ఆనందాలూ ప్రకటించలేం
కొన్నిటికి అనుభూతులే చాలు!

కొన్ని భావాలకు భాష వుండదు
చిన్ని స్పర్శ చాలు!

పువ్వుల నవ్వులకు అర్థం అక్కర్లేదు
అందం ఆస్వాదిస్తే చాలు!

మనసు దగ్గరైతే మాటల అవసరం లేదు
మౌనమే చాలు!

పలకరించే కనులకు
పరిచయం  అవసరం లేదు!
చిన్ని నవ్వు చాలు!

పండువెన్నెల ఇచ్చే హాయికి
పోలిక అక్కర్లేదు.
పరవశం చాలు!

ముచ్చటగా మురిసే మనసుకి
మురిపాలు అవసరం లేదు
చిన్ని గుర్తింపు చాలు!

అభిమానమున్న చోట
ఆహ్వానం అక్కర్లేదు.
గుర్తుచేసుకుంటే చాలు!

అందానికి అలంకరణలు 
అక్కర్లేదు.
మనస్ఫూర్తిగా నవ్వితే చాలు!

గోదావరి అందానికి వెన్నెలే 
అవసరం లేదు
బంగరు వెలుగుల ఉదయం చాలు!

నీటికి జిలుగుల అందమద్దే
అరుణోదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు