కపుర్తలా యువరాణి ఇందిరా దేవి కౌర్. ;- - జయా
 బిబిసీ రేడియో బ్రాడ్‌కాస్టర్‌గా ఆమె తనకంటూ ప్రత్యేకతను సంచరించుకున్నారు.
ఈమె కపుర్తలా మహారాజా పెద్ద కుమార్తె. నటి, ఫ్యాషన్ ఐకాన్ గానూ ఆమె అందరి దృష్టినీ ఆకర్షించారు. 
 ఆమె తన కాలంలో అత్యంత ఆకర్షణీయమైన మహిళల్లో ఒకరు.  1930లలో వోగ్ మ్యాగజైన్‌లో తరచూ కనిపించేవారు.
 రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె ఇంగ్లండ్‌లో స్వస్థత పొందుతున్న భారతీయ సైనికుల కోసం హిందీలో బీబీసీ రేడియో బ్రాడ్‌కాస్టర్‌ గా ఎప్పటికప్పుడు వార్తలను క్రమంతప్పకుండా అందించే వారు. 
 ఫ్రెంచ్ రెడ్‌క్రాస్ కోసం అంబులెన్స్‌లను నడిపారు. 
ఆమెను 'రేడియో ప్రిన్సెస్' అని పిలిచేవారు.

కామెంట్‌లు