వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి.
 అతిథిదేవోభవ  అన్నది హిందువుల మాట  స్థితి వార నక్షత్రాలతో సంబంధం లేకుండా అతని పనులు ఏవో చూసుకుంటూ   మధ్యలో భోజనం చేయడానికి ఆకలి  తీర్చుకోవడానికి ఏ గృహానికి వెళ్ళినా ఆ   గృహలక్ష్మి ఆప్యాయంగా ఆహ్వానించి  అతిధి మర్యాదలు చేసి  తనకు ఉన్న దాంట్లో సంతృప్తిగా అతనికి భోజనం ఏర్పాటు చేస్తుంది  అసలు అతిథి అంటేనే  ఆకస్మికంగా వచ్చేవాడు అని  ఆ వచ్చిన అతిధిని భగవత్ స్వరూపంగా ఆహ్వానించాలి  నాకీ అవకాశం భగవంతుడే ఇచ్చాడని ఆలోచించాలి  అతనికి భోజనం పెట్టిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోమని వారి వెళ్లేటప్పుడు వారికి పుష్పాలు ఫలాలు సమర్పించి వీటికి సంతోషించి  వచ్చినవాడు ధనవంతురైనా పేదవారైనా ఏ వర్ణం వారైనా తప్పక ఆదరించడం గృహస్థుధర్మంగా ఆ రోజుల్లో ఉంది.అతిథి మన ఇంటికి భిక్షకు వచ్చాడు అని అంటే  వారికి ఏ వనరులు లేక ఆ సమయంలో ఆకలి తీర్చుకోవడం కోసం వచ్చిన భగవత్ స్వరూపం అని ఆ గృహిణి భావిస్తుంది  అదే అభ్యాగతుడు వచ్చినప్పుడు అభ్యాగతుడు అంటేనే తిరిగి మళ్లీ వస్తాను అనేవాడు  ఆ వచ్చినవాడు కొంచెం  తిండిపోతుగా అనిపిస్తాడు  తాను భోజనం చేసి వెళ్లే ముందు  అమ్మ నేను పలానా సమయానికి ఫలానా రోజున వస్తాను  ఆ రోజున నాకు ఈ కూర ఇష్టం  ఈ పచ్చడి అంటే ప్రాణం  ఈ పులుసు లేకుండా నాకు ముద్ద దిగదు  మీరు చేసే కలగలుపు   కూర లేకపోయినట్లయితే నిండుతనం ఉండదు చిక్కటి పాలలో తోడు వేసిన    మీగడ పెరుగు లేకపోతే  భోజనం చేసిన తృప్తి ఉండదమ్మా  కనుక ఆ పదార్థాలతో చేసి పెట్టు అని చెప్పి మరీ వెళతాడు  వారి కోరికలను తూచా తప్పకుండా ఈ కోరికలను పాటించి  తన మాట నిలుపుకుంటుంది  అది ఆనాటి సనాతన ధర్మం.మనుషుల తత్వాలలో మంచి చెడు  రెండు ఉంటాయి  అవి దేవతలకు కావచ్చు రాక్షసుడు కావచ్చు మరి ఎవరైనా కావచ్చు  శ్రీరామచంద్రమూర్తిలాంటి  ధర్మాచరణ చేసిన మహానుభావుడు రాజ్యంలో ఒక తాగుబోతు అన్న చిన్న మాటకు  సీతమ్మ రాజ్యం వదిలి అడవులకు వెళ్లి  వాల్మీకి మహర్షి   వద్ద తల దాచుకోవలసి వచ్చింది  రావణ రాజ్యంలోకి వెళ్లిన రాముడు యుద్ధం గెలవడం కోసం రావణుడి తమ్ముడి సలహాలు ఉపయోగపడ్డాయి  మంచి వాళ్ళ రాజ్యంలో కూడా చెడ్డవాళ్ళు ఉంటారు చెడ్డవాల్ల ఇంట్లో కూడా మంచివాడు ఉంటారు  నీకు ఏది చెందవలసి ఉన్నది  వాటిని ఆ కాలమే నీ దగ్గరికి తీసుకొస్తుంది  ఒకరోజు మీకు వస్తుంది వద్దన్నా నిలబడతావు ఎవరు కాదన్నా  నీ ప్రజ్ఞకు తగినట్లుగా ఇంకా ఎదుగుతూనే ఉంటావు  మంచితనాన్ని వాడుకోవద్దు  అని పెద్దల మాట.
====================================
సమన్వయం ; - డా. నీలం స్వాతి 

కామెంట్‌లు